తెలంగాణలో ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూస్తున్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రానే వచ్చింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్రంలోని ఏడు కార్పోరేషన్లు, 116 మున్సిపాలిటీల ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ షెడ్యూల్ వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని తెలిపారు. జనవరి 27 నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. 28 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. జనవరి 30తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగియనుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ ఏర్పాటు చేసి.. 13న ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఎక్కడైనా రీపోలింగ్ నిర్వహించాల్సి వస్తే ఫిబ్రవరి 12న రీపోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు కార్పొరేషన్లు, 116 మునిసిపాలిటీలలో 52, 43,000 మంది ఓటర్లు ఉన్నారు.






