తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శుభవార్త తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లో పనిచేస్తున్న సుమారు 5.14 లక్షల మంది 12 ఉద్యోగులకు రూ.1.02 కోట్ల విలువైన ఉచిత ప్రమాద బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఈ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్రంలోని ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు జరిగిందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రం అనేక ఆర్థిక సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాల నిమిత్తం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.
ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణలో లేదా ఇతర ప్రమాదాల్లో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబం వీధిన పడకుండా ఉండాలనేదే ప్రధాన ఉద్దేశం అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో 5.14 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరికి ఈ ప్రమాద బీమా వర్తించనుంది. దీనివల్ల లక్షలాది కుటుంబాలకు సామాజిక భద్రత చేకూరుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో సింగరేణి, విద్యుత్ శాఖలో కోటి రూపాయల బీమా రక్షణ కవచం పథకం అమలు అవుతుందని.. సింగరేణిలో 38వేల మంది రెగ్యులర్ కార్మికులతో పాటు, విద్యుత్ సంస్థలో 71387 ఉద్యోగులకు ఈ పథకం వర్తిస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బీమా పథకం వర్తించనుంది.





