కరీంనగర్ ప్రజావాణిలో విన్నవించిన కడారి అయిలన్న కురుమ, చిగుర్ల శ్రీనివాస్ కురుమ
కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థలో నూతనంగా ఏర్పడ్డ డివిజన్ల విభజనలో కొన్ని బౌగోళికంగా అస్తవ్యస్తంగా ఉన్నాయని, వీటిని సవరించాలని పూలే బిసి సంక్షేమ సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి అయిలన్న కురుమ, జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిగుర్ల శ్రీనివాస్ సోమవారం ప్రజావాణిలో విన్నవించారు. ఒక రోడ్డు రెండు డిజైన్ లో ఉండడం వలన మున్సిపల్ వాటర్ పైప్ లైన్ గాని, స్ట్రీట్ లైట్స్ గాని, పారిశుద్ధ పరంగా గాని, రోడ్లు వేయడానికి, పాలనపరంగా పలు డివిజన్లలో అభివృద్ధి లో సమస్యలు తలెత్తి వారికి అవగాహన పరంగా సమస్యలెత్తుతున్నాయని తెలిపారు. ఒక రోడ్డు ఇరువైపులా ఒకే డివిజన్లో వచ్చే విధంగా సవరించాలని వారు కోరారు. డివిజన్లు సవరించితె పరిపాలన సౌకర్యం బాగుంటుందని, కార్పొరేటర్లు కూడా పనులు చేయడానికి అనుకూలంగా ఉంటాయని అన్నారు.





