Tuesday, January 27, 2026

జెన్ జెడ్ (Gen Z) యూత్ అంటే ఎవరు? వీరి ప్రభావం ఎంత?

ప్రస్తుత కాలంలో సమాజం, టెక్నాలజీ, మార్కెట్ రంగాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పదం జెన్ జెడ్ (Generation Z). జెన్ జెడ్ యూత్ కారణంగా రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతున్నాయి. నేపాల్ లో ప్రభుత్వం కూలిపోయే స్థితికి వచ్చింది. బంగ్లాదేశ్ లో అలజడి సృష్టించడానికి కారణమైంది. భారత్ లోనూ కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వాలు మారడానికి జెన్ జెడ్ యూత్ ప్రభావం ఎక్కువగా ఉందని అంటున్నారు. అలాగే మంచి, చెడుల విషయాలను హైలెట్ చేయడానికి జెన్ జెడ్ యూత్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని అంటున్నారు. రానున్న రోజుల్లో జెన్ జెడ్ యూత్ తోనే చాలా విషయాల్లో మార్పులు రావొచ్చని అంటున్నారు. అసలు ఈ జెన్ జెడ్ యూత్ అంటే ఎవరు?

తరాల్ని గుర్తించేందుకు అక్షరాల క్రమంలో పేర్లు పెట్టడం ఆనవాయితీగా ఉంది. బేబీ బూమర్స్, జెన్ ఎక్స్, మిల్లేనియల్స్ (జెన్ వై) తర్వాత వచ్చిన తరం కావడంతో వీరికి జెన్ జెడ్ అనే పేరు వచ్చింది.

బేబీ బూమర్స్ (Baby Boomers):

జన్మించిన కాలం: 1946 – 1964
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జననాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఆ “బేబీ బూమ్” వల్ల ఈ తరం ఏర్పడింది.
ముఖ్య లక్షణాలు:
కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ
ప్రభుత్వ ఉద్యోగాలు, స్థిరమైన కెరీర్‌పై ఆసక్తి
సంప్రదాయాలు, కుటుంబ విలువలకు ప్రాధాన్యం
టెక్నాలజీకి తర్వాతి దశలో అలవాటు
ఉదాహరణ: స్వాతంత్ర్యం తర్వాత భారతదేశ నిర్మాణంలో పాత్ర పోషించిన తరం.

జెన్ ఎక్స్ (Generation X):

జన్మించిన కాలం: 1965 – 1980
సంప్రదాయ జీవితం నుంచి ఆధునికత వైపు మార్పు చూసిన తరం.
ముఖ్య లక్షణాలు:
స్వతంత్రంగా ఆలోచించే స్వభావం
ఉద్యోగ భద్రతతో పాటు వ్యక్తిగత స్వేచ్ఛపై ఆసక్తి
టీవీ, రేడియోతో పెరిగి తర్వాత కంప్యూటర్లను నేర్చుకున్న తరం
బాధ్యతాయుత కుటుంబ జీవితం
ఉదాహరణ: ప్రభుత్వ–ప్రైవేట్ రంగాల మధ్య సమతుల్యం చూసిన తరం.

మిల్లేనియల్స్ / జెన్ వై (Millennials / Gen Y):


జన్మించిన కాలం: 1981 – 1996
2000 సంవత్సరం (మిల్లేనియం) చుట్టూ యువతగా ఉన్న కారణంగా ఈ పేరు వచ్చింది.
ముఖ్య లక్షణాలు:
ఇంటర్నెట్ ప్రారంభ దశను చూసిన తరం
చదువు, కెరీర్‌లో పోటీ భావన ఎక్కువ
సోషల్ మీడియాకు తొలితరం వినియోగదారులు
వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌పై దృష్టి
ఉదాహరణ: ఐటీ బూమ్, గ్లోబలైజేషన్‌ను పూర్తిగా అనుభవించిన తరం.

జెన్ జెడ్ (Gen Z) :

1997 నుంచి 2012 మధ్య కాలంలో జన్మించిన యువతను జెన్ జెడ్ యూత్‌గా పిలుస్తారు. ప్రస్తుతం ఈ తరం విద్యార్థులుగా, ఉద్యోగార్ధులుగా, కొత్త సామాజిక సేవాకర్తలుగా సమాజంలో కీలక పాత్ర పోషిస్తోంది. చిన్నప్పటి నుంచే స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్‌తో పెరిగిన ఈ తరం పూర్తిగా డిజిటల్ ప్రపంచానికి అలవాటుపడింది.ఈ తరం యువత స్వేచ్ఛగా ఆలోచిస్తుంది. తమ అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తపరుస్తారు. సంప్రదాయ ఉద్యోగాలకన్నా స్టార్టప్స్, ఫ్రీలాన్స్, డిజిటల్ కెరీర్‌ల వైపు ఆసక్తి చూపుతున్నారు. సామాజిక సమానత్వం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై చురుకైన పాత్ర పోషిస్తున్నారు.

సమాజంపై జెన్ జెడ్ ప్రభావం

జెన్ జెడ్ వల్ల సమాజంలో వేగవంతమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీ వినియోగం పెరిగింది. అయితే అధిక స్క్రీన్ టైమ్, మానసిక ఒత్తిడి వంటి సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి. సరైన మార్గనిర్దేశం, అవగాహన కల్పిస్తే ఈ తరం దేశ భవిష్యత్తును మరింత బలంగా తీర్చిదిద్దగలదు.

మేధావులు ఏమన్నారంటే?

ప్రముఖ సైకాలజిస్టు డాక్టర్ జీన్ ట్వెంజ్ (Jean Twenge)జెన్ జెడ్‌ను “iGen” అని పిలిచారు. ఈ తరం మానసిక ఆరోగ్యంపై ఎక్కువ ఒత్తిడిలో ఉందనిసోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉందని తెలిపారు.

వ్యాపార రంగ ప్రముఖుడు బిల్ గేట్స్ “జెన్ జెడ్ యువతకు టెక్నాలజీ సహజం. సరైన దిశలో నడిపిస్తే ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు కనుగొంటారు” అని అభిప్రాయపడ్డారు.

ఎలాన్ మస్క్.. జెన్ జెడ్ సృజనాత్మకత ఎక్కువగా ఉన్నా, ఓర్పు తగ్గుతోందని పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News