తెలంగాణలో సహకార సంఘాల కాల పరిమితి ముగిసింది. దీంతో ఇవి ఆయా జిల్లాల పర్సన్ ఇన్ ఛార్జుల ఆధీనంలోకి వెళ్లాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సహకార సంఘాల ఎన్నికలు ఉండవని.. వీటిని రద్దు చేస్తారని.. నామినేటెడ్ ద్వారా ఎన్నుకుంటారని అంటున్నారు. భారతదేశంలో సహకార సంఘం సామాజిక, ఆర్థిక బలోపేతానికి ఎంతో ఉపయోగపడుతుందని మేధావులు అంటున్నారు. ఈ సంఘాలు ఉమ్మడి అవసరాలు ఉన్న వ్యక్తులకు ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు. అసలు సహకార సంఘం ఎలా పనిచేస్తుంది? వీటికి ఎన్నికలు ఎలా ఉంటాయి?
రైతులు విత్తనాలు, ఎరువులు తక్కువ ధరలకు పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడానికి, వారి ఉత్పత్తులను మెరుగైన ధరలకు సమిష్టిగా మార్కెట్ చేయడానికి వ్యవసాయ సహకార సంస్థను ఏర్పాటు చేశారు. స్వాతంత్రానికి ముందే వ్యాపారుల దోపిడీ నుంచి రక్షణ కల్పించడానికి 194లో సహకార క్రెడిట్ సొసైటీల చట్టాన్ని తీసుకురావడంలో కొంతమంది కృషి చేశారు. అయితే 1947 తర్వాత సహకార సంఘాలు ఆర్థిక అభివృద్ధికి కీలకమైన సాధనంగా గుర్తించబడ్డాయి. 1963 లో వ్యవసాయ మార్కెటింగ్, ప్రాసెసింగ్ సహకార సంస్థలను ప్రోత్సహించడానికి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ప్రారంభించారు.
భారతదేశంలో సామాజిక ఆర్థిక వ్యవస్థకు సహకార సంఘాలు బలమైన స్తంభాలుగా ఏర్పడ్డాయి. ఇవి వ్యవసాయ రంగం, పాడి, ఆర్థిక చేయూత, సాధికారిక కోసం విభజించబడ్డాయి. తెలంగాణలో సహకార వ్యవస్థ విస్తృతంగా ఉంది. ప్రాంతీయ డేటా ప్రకారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలో సుమారు 60,125 ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి, వీటిలో క్రెడిట్, పశుపోషణ, మత్స్యకార, పాలరైతు, లేబర్ సహకార సంఘాలు వంటి విభిన్న రకాలుగా ఉన్నాయి. మొత్తం 1.42 కోటికి పైగా సభ్యులు ఈ సంఘాల ద్వారా ప్రయోజనాలు పొందుతున్నారు.
సహకార సంఘాల ముఖ్య లక్ష్యం స్వయం సహకార ధోరణిని ప్రోత్సహించడం, ఆర్థిక సహకారం, సమాజ సంక్షేమం కచ్చితంగా అందించడం. కేవలం లాభం మాత్రమె కాకుండా సహకార ద్వారాన్నివారు సమూహ సమతుల్యత, ఆర్థిక స్వావలంబన, గ్రామీణ అభివృద్ధి వంటి ప్రధాన సమస్యలను పరిష్కరించగలుగుతున్నారు. ఉదాహరణకు వ్యయ శ్రేణి నిధి (క్రెడిట్) సహకార సంఘాలు, వ్యవసాయ పంటలు కొనుగోలు/నిల్వ, ఎరువుల పంపిణీ, పశు సంరక్షణ, వ్యవసాయ ఉపకరణాలు అందించడం వంటి సేవలు సమిష్టిగానే చేస్తాయి. వీటి ద్వారా రైతులు, చిన్న వ్యాపారులు, ఉద్యోగులు, గ్రామీణ కమ్యూనిటీల సభ్యులు వంటి విభిన్న వర్గాలు ప్రయోజనాలను పొందగలుగుతారు, ఎందుకంటే ఇది మధ్యవర్తుల తొలగింపుతో న్యాయమైన ధరలు, సౌకర్యం మరియు సమానపరమైన అవకాశాలను కల్పిస్తుంది.
సహకార సంఘాల ఎన్నికలు
తెలంగాణ సహకార సంఘాల చట్టం–1964 ప్రకారం, ప్రభుత్వ పర్యవేక్షణలో ఈ ఎన్నికలు నిర్వహించబడతాయి.సహకార సంఘం పాలక మండలి పదవీకాలం ముగిసిన తర్వాత లేదా అవసరమైతే ముందుగానే ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి సహకార శాఖ అధికారులు అధికారికంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నోటిఫికేషన్‌లో ఎన్నికల షెడ్యూల్, ఖాళీ పదవులు, అర్హతలు, నామినేషన్ తేదీలు వివరంగా ప్రకటిస్తారు.
ఎన్నికల ప్రక్రియలో తొలి దశగా ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తారు. సంఘంలో చెల్లుబాటు అయ్యే సభ్యత్వం కలిగి, బకాయిలు లేని సభ్యులే ఓటర్లుగా అర్హులు. ప్రాథమిక ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు స్వీకరించి, వాటిని పరిష్కరించిన తర్వాత తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.తదుపరి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే సభ్యులు నిర్ణయించిన తేదీలోపు నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలి. ప్రతీ అభ్యర్థికి ఒక ప్రతిపాదకుడు, ఒక మద్దతుదారు తప్పనిసరి. ఎన్నికల అధికారి నామినేషన్ పత్రాలను పరిశీలించి అర్హతలు లేనివాటిని తిరస్కరిస్తారు. అర్హులైన అభ్యర్థులకు నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశం కూడా కల్పిస్తారు.
అభ్యర్థుల సంఖ్య ఖాళీల కంటే ఎక్కువగా ఉంటే పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ రోజున రహస్య ఓటింగ్ పద్ధతిలో బ్యాలెట్ పేపర్ లేదా ఈవీఎం ద్వారా ఓటింగ్ జరుగుతుంది. ప్రతి సభ్యుడికి ఒకే ఓటు హక్కు ఉంటుంది. అభ్యర్థుల సంఖ్య ఖాళీలకు సమానంగా ఉంటే ఎన్నిక ఏకగ్రీవంగా ముగుస్తుంది.పోలింగ్ పూర్తైన అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి, అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు. ఎన్నికైన పాలక మండలి సభ్యుల్లోంచి అంతర్గతంగా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు.సహకార సంఘాల ఎన్నికలు సభ్యుల భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో, సంఘాల్లో పారదర్శకత, బాధ్యతను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గ్రామీణ ఆర్థికాభివృద్ధికి ఈ ఎన్నికలు దిశానిర్దేశం చేస్తున్నాయని నిపుణులు





