Wednesday, January 28, 2026

సినిమాల్లో ఇప్పుడు ‘గెటప్’ ట్రెండింగ్..

కాలం మారుతున్న కొద్దీ సినిమా రంగంలో పోటీ పెరిగిపోతుంది. ఒకప్పుడు కొంతమంది హీరోలు, హీరోయిన్లు మాత్రమే అద్భుతమైన నటన ప్రదర్శించి ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు తామేం తక్కువ లేదు అన్నట్లు విభిన్న గెటప్పులతో అలరిస్తున్నారు. మొన్నటి వరకు హీరోగా కనిపించినవారు ఇప్పుడు విలన్లుగాను.. విలన్ గాను కనిపించిన వారు కమెడియన్లగాను.. సాధారణ నటులు ఉన్నవారు విలన్లుగాను ఇలా విభిన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే ఇటీవల సినిమా ప్రపంచం కష్టాలను ఎదుర్కొంటున్న తరుణంలో కొందరు డైరెక్టర్లు నటుల గెటప్పులను మొత్తం మార్చివేసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా లేటెస్ట్గా శ్రీకాంత్ ఓదెల తీయబోతున్న ఓ సినిమాలో మొన్నటి వరకు కామెడీతో అలరించిన ఓ నటుడు గెటప్ ని మార్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసా?

శ్రీకాంత్ ఓదెల ‘దసరా’మూవీతో తెలుగు ప్రజల మనసులను దోచుకున్నాడు. ఇప్పుడు ‘ది ప్యారడైజ్‘ (The Paradise) అనే మూవీతో రాబోతున్నాడు. ఇందులో నాని హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే నాని గెటప్ మతి పోగొట్టింది. జడలతో జైల్లో ఉన్న నాని గ్లింప్స్ తో ప్రేక్షకులు సినిమా వచ్చేవరకు ఆగలేకపోతున్నారు. ఇప్పుడు తాజాగా ఓ కమెడియన్ ను విలన్గా చూపించి ఆకట్టుకున్నాడు.

ఆ కమెడియన్ ఎవరో కాదు సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu) . హృదయ కాలేయం అనే ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిచిన సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu) ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించి.. దూరమయ్యాడు. సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu) ఇక సినిమాల్లో నటించడు.. అని అనుకుంటున్న తరుణంలో మరోసారి తన గెటప్తో పిచ్చెక్కించాడు. కుడి చేతిలో పొడవైన ఇనుప ఆయుధాన్ని ధరించి.. మరో చేతిలో సిగిరెట్ పట్టుకున్న ఈయన చూసి ఎవరో బాలీవుడ్ విలన్ అని అనుకుంటారు. కానీ ఈయన సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu) అని చెప్పేదాకా ఎవరు గుర్తించరు.వచ్చే ‘ది ప్యారడైజ్‘ (The Paradise) సినిమాలో అలరించబోతున్నాడు. అంతకుముందు కామెడీతో అలరించిన సునీల్.. పుష్ప సినిమాలో విలన్ గా తన పర్ఫామెన్స్ చూపించాడు. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) తన యాక్టింగ్ తో అదరగొట్టే అవకాశం ఉంది. ఎందుకంటే డైలాగ్ కింగ్ గా పేరు మోసిన సంపూర్ణేష్ బాబు (Sampoornesh Babu) ఈ గెటప్ లో బాగా షూట్ అవుతాడని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

అటు తమిళంలోనూ గెటప్ ల విషయంలో పోటీ పడుతున్నారు. సోషల్ మీడియాలో ఒక అందమైన అమ్మాయి ఆభరణాలు ధరించి కనిపించిన ఒక ఫోటో వైరల్ అవుతుంది. ఈమె ఏ సినిమాలో హీరోయిన్? అని అనుకుంటున్నారు. కానీ ఆమె హీరోయిన్ కాదు.

తమిళ స్టార్ హీరో, డైరెక్టర్ బి శెట్టి (Director B Shetty). సాధారణంగా సింపుల్ గా కనిపించే బి శెట్టి (Director B Shetty) లేడీ గెటప్ లో ఆకట్టుకుంటున్నాడు. 63 ఏళ్ల వయసులో లేడీ గెటప్ లో ఎంతో అందమైన అమ్మాయిగా కనిపించిన ఈయన వచ్చే ’45’అనే సినిమాలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఉపేంద్ర నటిస్తున్నాడు. ఆయనతోపాటు ఈయన కూడా ఆకట్టుకోనున్నాడు.

ఈ పరిస్థితి చూస్తే రాను రాను ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి గెటప్లు ప్రధానంగా మారనున్నాయి. నటులు ఎవరైనా ఏ గెటప్ వేయడానికి అయినా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ రెండు గెటప్ లో నటులు ఏ విధంగా అలరిస్తారో చూడాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News