కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు కడారి అయిలన్న కురుమ
కరీంనగర్: త్వరలో జరిగే సర్పంచ్ ఎన్నికల్లో నిజాయితీపరులను గెలిపించాలని కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు కడారి అయిలన్న కురుమ, జిల్లా సహాయ కార్యదర్శి మేకల నర్సయ్య కురుమ, జిల్లా సలహాదారులు చెట్కూరి రాములు కురుమ పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ సమీపమున గల సంఘం కార్యాలయములో వీరు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ జిల్లాలో అత్యధిక జనాభా గల కురుమలు నీతి, నిజాయితీకి మారు మారుపేరు అన్నారు. స్థానిక సంస్థలలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ గా అవకాలిస్తే స్వంత పనులను వదలి కూడా సమాజానికి నిస్వార్థముగా సేవ చేస్తారన్నారు. గతంలో గుంటి మల్లయ్య కురుమ చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులుగా, ఎల్కపెల్లి లచ్చయ్య కురుమ గంగాధర మార్కెట్ కమిటి చైర్మన్ గా ఎలా అభివృద్ధి చేశారో మన అందరికి తెలుసన్నారు. ప్రస్థుత ఎన్నికలలో కురుమలను ప్రజా ప్రతినిధులుగా గెలిస్తే మచ్చలేని నాయకులుగా గ్రామాన్ని అభివృద్ధి పథములో నడిపించి సమాజంలో శబాష్ అనిపించుకుంటారన్నారు. ఇప్పుడిప్పుడే గ్రామ స్థాయి నాయకులుగా ఎదుగుతున్న కురుమలను అన్నివర్గాల ప్రజలు ఆశీర్వదించాలన్నారు.





