కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన చొప్పదండి శాసనసభ్యులు మేడిపెల్లి సత్యంను బుధవారం కురుమ సంఘం కరీంనగర్ జిల్లా నాయకులు సన్మానించారు. కరీంనగర్ లోని బాలాజి నగర్ లో ఆయన ఇంట్లో మర్యాదపూర్వకముగా కలిసి శాలువాతో సన్మానించి బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు కడారి అయిలన్న కురుమ, రాష్ట్ర కార్యదర్శి ఎల్కపెల్లి లచ్చయ్య, జిల్లా సహాయ కార్యదర్శి మేకల నర్సయ్య, చొప్పదండి నియోజకవర్గ అధ్యక్షులు ఒగ్గు మల్లేశం, పంచాయితీ కమిటి జిల్లా అధ్యక్షులు కోరె గట్టయ్య, రామడుగు మండల అధ్యక్షులు కడారి వీరయ్య, సెవ్వాల్ల గంగయ్య, పెద్దిగారి తిరుపతి, ఎల్లమ్మల కృష్ణంరాజు తదితర సంఘం నాయకులు పాల్గొన్నారు.






