పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమైనది. అయితే అమ్మాయిని పెంచడంలో వీరి బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఒక కూతురి జీవితంపై తల్లిదండ్రుల్లో తండ్రి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒక అమ్మాయికి మొదటి భరోసా, మొదటి రక్షణ తండ్రి.. అమ్మాయి చిన్న వేళ్లను పట్టుకున్న తండ్రి, జీవితమనే పెద్ద ప్రపంచాన్ని ఎలా చూడాలో ఆమెకు నేర్పుతాడు. చిన్నప్పటి నుంచి తండ్రి ఇచ్చే ప్రేమ, ప్రోత్సాహం, ధైర్యం—ఆమె హృదయంలో ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని నాటుతుంది. ‘నువ్వు చేయగలవు’ అని ఒకసారి తండ్రి చెప్పితే… ఆ అమ్మాయి ప్రపంచమే గెలిచే ధైర్యం తెచ్చుకుంటుంది. ఎందుకంటే తండ్రి మాట ఆమెకు ఒక శక్తి, ఒక ఆధారం.
- తనకు తండ్రి ఎలా ప్రేమ చూపిస్తాడో ఆమె గుర్తుంచుకుంటుంది. భవిష్యత్తులో ‘నన్ను నిజంగా ప్రేమించే వ్యక్తి ఉంటాడా ?’ అనే ప్రశ్నకు సమాధానం తండ్రి ఇచ్చేలా ఉండాలి.
- తండ్రి తన భార్యను, కుటుంబాన్ని ఎలా గౌరవిస్తాడో చూసి ‘ఒక పురుషుడు మహిళను ఎలా గౌరవించాలి?’ అని ఆమె నేర్చుకుంటుంది.
- చిన్నప్పటి నుంచి తండ్రి ప్రోత్సాహం, ‘నీకు వస్తుంది… నువ్వు చేయగలవు’ అనే మాటలు అమ్మాయి జీవితాంతంలో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి.

- తండ్రి తన కూతురి అభిప్రాయాలు గౌరవిస్తే.. ఆమె కూడా ఇతరుల దగ్గర హద్దులు పెట్టుకోవడం నేర్చుకుంటుంది.
Yes అంటే Yes… No అంటే No అని చెప్పే స్పష్టత వస్తుంది.
- తండ్రి పని, డిసిప్లిన్, కష్టాన్ని చూసి.. ఆమె జీవితంలో “Work ethic” అనే శక్తివంతమైన అలవాటు వేర్లు వేస్తుంది.
- తండ్రితో ఉన్న అనుబంధం ఆమెకు ఒక ఎమోషనల్ సేఫ్ స్పేస్. ఆమెకి ఏ పరిస్థితులలోనైనా “I am safe” అనే ఫీలింగ్ వస్తుంది.
తండ్రి ఆమెను ఎలాంటి మాటలు, ప్రవర్తన అర్హిస్తుంది అనే భావన నేర్పుతాడు. తండ్రితో ఉన్న అనుభవాలు ఆమె భవిష్యత్తులో ఎవరిని “Allow” చెయ్యాలి, ఎవర్ని “Avoid” చెయ్యాలి అనేదానికి ఒక బెన్చ్‌మార్క్ అవుతాయి.తండ్రిని ఎలా మాట్లాడుతాడో, ఎలా ప్రవర్తిస్తాడో, ఎలా ఇతరులను గౌరవిస్తాడో కూతురు నిశ్శబ్దంగా గమనిస్తుంది. ఆ గమనించడమే ఆమె భవిష్యత్తులో పురుషులను ఎలా చూసుకోవాలో నిర్ణయించే పునాది అవుతుంది. అమ్మాయి నేర్చుకునే మొదటి ‘గౌరవం’ తండ్రి ఇంట్లో చూపే ప్రవర్తనే. ఆయన తల్లి, కుటుంబ సభ్యులతో ఎలా మసలుకుంటాడో చూసి… “ఒక మంచి మనిషి అంటే ఇలా ఉండాలి” అన్న అంచనా ఆమె మనసులో ఏర్పడుతుంది.
పాఠశాలలో ఫెయిల్ ఐనా.. జీవితంలో కష్టాలు వచ్చినా.. తండ్రి చెప్పే ఒక మాట ‘నేను ఉన్నా… నువ్వు భయపడకు’ మెకు ఒక ఎమోషనల్ సేఫ్టీ నెట్ లా మారిపోతుంది. తండ్రి ఇచ్చే ఈ భద్రత భావం కారణంగా కూతురు జీవితంలో బలమైన నిర్ణయాలు తీసుకునే శక్తి పొందుతుంది. ఆమె “No” అనే మాటను చెప్పడం నేర్చుకుంటుంది. తన విలువను అర్థం చేసుకుంటుంది. తనకూ స్టాండర్డ్స్ ఉండాలి అని గ్రహిస్తుంది.

ఒక అమ్మాయి భవిష్యత్తులో ఎవరిని ప్రేమించాలో, ఎవరిపై నమ్మకం ఉంచాలో, ఎవరిని తాను అర్హించింది అనుకోవాలో.. ఈ అన్నింటికీ తండ్రి ఇచ్చే అనుభవాలే ఒక బెంచ్ మార్క్ అవుతాయి. తండ్రి ప్రేమను నిజంగా అలవర్చుకుంటే.. ఆమె ఎవరి మాటకీ, ప్రవర్తనకీ తక్కువపడదు.
చివరగా… కూతురికి తండ్రి ఒక వ్యక్తి కాదు.. ఒక భావం. ఒక శక్తి. జీవితాంతం ఆమెను నడిపించే విలువల రూపం. అలా చూసినప్పుడు… ఒక అమ్మాయి జీవితంలో తండ్రి ప్రభావం అపారమైనది.. అనిర్వచనీయమైనది.





