Saturday, December 6, 2025

భారతదేశంలో కిచెన్ గదిని సౌత్ ఈస్ట్ లో ఎందుకు ఉంచుతారు?

భారతదేశంలో ఇంటి నిర్మాణంలో వంటగదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మన సంప్రదాయాల ప్రకారం వంట చేసే ప్రదేశం కుటుంబ ఆరోగ్యం, ఆనందం, ఆర్థిక స్థిరత్వంపై ప్రభావం చూపుతుందని భావిస్తారు. అందుకే ఇండ్లు నిర్మించేటప్పుడు చాలా మంది వాస్తు శాస్త్రాన్ని అనుసరిస్తూ కిచెన్‌ను సౌత్-ఈస్ట్ దిశలో ఏర్పాటు చేస్తారు. వాస్తులో ఈ భాగాన్ని అగ్ని మూలగా పరిగణిస్తారు. అగ్ని శక్తి వంటకానికి అనుకూలమైనదిగా భావించబడుతుంది. అందువల్ల ఈ దిశలో కిచెన్ ఏర్పాటు చేస్తే ఇంట్లో శక్తుల సమతుల్యం కాపాడబడుతుందని నమ్మకం ఉంది. అయితే వాస్తు ప్రకారంగానే కాకుండా శాస్త్రీయంగా కూడా కిచెన్ సౌత్ ఈస్ట్ లో ఉండాలని తెలుస్తోంది. ఎందుకంటే?

వాస్తు శాస్త్రం ప్రకారం.. సౌత్ ఈస్ట్ (అగ్ని మూలం) అగ్ని తత్త్వానికి అనుకూలం. ఈ ప్రదేశంలో వంట అంటే అగ్ని ఉపయోగించే పని కాబట్టి.. అగ్ని శక్తి ఎక్కువగా ఉన్న మూలలో వంట చేస్తే గృహంలో స్థిరత్వం, ఆరోగ్యం, సంపద పెరుగుతాయని వాస్తు భావన. ఈశాన్యం వంటి దిశల్లో కిచెన్ పెట్టకూడదు. ఈశాన్యం జల, పూజ, సానుకూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. ఈ దిశలో అగ్ని పనులు చేస్తే మానసిక ఒత్తిడి, ఆర్థిక సమస్యలు వస్తాయని వాస్తు చెప్తుంది.

శాస్త్రీయంగా కూడా సౌత్-ఈస్ట్ దిశలో కిచెన్ ఉంచడం ప్రయోజనకరమే అని తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ వంట గది ఉంటే ఉదయం సమయంలో సూర్యకిరణాలు నేరుగా ఇంట్లోకి ప్రసరిస్తాయి. దీంతో బ్యాక్టీరియా రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఉదయం లేవగానే స్త్రీలు ఇక్కడ ఎక్కువ సేపు ఉంటారు. దీంతో వారికి డీ విటమిన్ అందే అవకాశం ఉంటుంది. అంతేకాక గాలి ప్రవాహం కూడా ఈ ప్రాంతంలో సహజసిద్ధంగా మెరుగ్గా ఉంటుంది. భారతదేశంలో గాలి ప్రధానంగా ఈశాన్యం నుంచి నైరుతి వైపు వీచుతుంది. ఈ కారణంగా వంట సమయంలో వచ్చే పొగ, వేడి సులభంగా బయటికి వెళ్లి, ఇల్లు అంతటా వ్యాపించకుండా ఉంటుంది. సౌత్ ఈస్ట్ బెడ్‌రూమ్ల నుండి దూరంగా ఉంటుంది. అలాగే ప్రధాన ప్రవేశ ద్వారం నుండి దూరంగా ఉంటుంది. దీంతో వంట సమయంలో ప్రమాదాలు జరిగితే ఈ గదులు సురక్షితంగా ఉంటాయి.

ఇప్పుడు ఆధునికంగా నిర్మించే గృహాల్లో కూడా ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, చిమ్నీలు ఉన్నప్పటికీ సౌత్-ఈస్ట్ లో కిచెన్ వేడి, ఆవిరి త్వరగా బయటకు వెళ్తుంది. బిల్డింగ్ లేఔట్ ప్రకారం ప్లంబింగ్, వెంట్‌లు సులువుగా అమరవచ్చు. ఇంటి మొత్తం ఉష్ణోగ్రత సంతులనం ఉంటుంది. అందువల్ల ఇంటి నిర్మాణ సమయంలో కిచెన్ ను సౌత్ ఈస్ట్ లో ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం అని అంటున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News