Saturday, December 6, 2025

ఇనుము, గాజు, రబ్బరు… చివరికి విమానమే తిన్న మనిషి! మిచెల్ లోటీది వింత గాథ

ప్రపంచంలో అద్భుతమైన వ్యక్తులను ఇప్పటి వరకు చాలా మందిని చూసే ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఇనుమును తినే వ్యక్తుల గురించి ఎవరైనా విన్నారా? అంటే తెలియదు అన్నవాళ్లే చాల మంది ఉంటారు. కానీ ఓ వ్యక్తి ఇనునుము ఆహారంగా మార్చుకొని తింటూ వచ్చాడు. అలా ఏ చిన్న మేకులు, ఇనప సామాను కాదు.. ఏకంగా విమానాన్నే తిన్నాడు. అలాగే సైకిల్, టెలివిజన్ ఇలా అవలీలగా నోట్లో వేసుకుంటాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఇలా తిన్న కూడా అతడికి ఏం కాలేదా?

బాల్యం నుండి విచిత్ర అలవాట్లు

మిచెల్ లోటీ.. ఈ పేరు గురించి ఫ్రాన్స్ వారికి బాగా తెలుసుకు.. ఎందుకంటే ఆయన అక్కడే జన్మించాడు. 1950లో ఫ్రాన్స్‌లోని గ్రెనోబుల్ నగరంలో మిచెల్ లోటీ జన్మించాడు. చిన్న వయసులోనే ఆయనకు ఒక అరుదైన మానసిక, శారీరక పరిస్థితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆ పరిస్థితి పేరు ‘పికా సిండ్రోమ్’ (Pica Syndrome). ఈ వ్యాధి వల్ల మనిషి తినకూడని వస్తువులు, మట్టి, ఇనుము, ప్లాస్టిక్, గాజు లాంటి వాటిని తినాలనే ఆకలి కలుగుతుంది. దీంతో మిచెల్ లోటి చిన్న వయసులోనే గాజు ముక్కలు తినడం అలవాటు చేసుకున్నాడు. దీంతో అతనికి ఎలాంటి నష్టం జరగకపోవడంతో దీనిని ఆయన ‘ప్రదర్శన’ చేయడం మార్చుకున్నారు. ఇందులో భాగంగా 1970లో ఆయన ‘Monsieur Mangetout (మిస్టర్ ఈట్స్-ఇట్-ఆల్)’ అనే పేరుతో చేసిన ప్రదర్శనతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత వేదికలపై సైకిల్, టీవీ, గడియారాలు, రేడియో, రబ్బరు తిన్నాడు.
ప్రేక్షకులు ఆశ్చర్యపోతూ ఆయన ప్రదర్శనలను నిలబడి చప్పట్లతో స్వాగతించేవారు.

విమానాన్నే తినేశాడు..

1978లో మిచెల్ లోటీతో Cessna 150 అనే చిన్న విమానాన్ని కట్ చేసి తినడం ప్రారంభించాడు. దానిని ఆయన రెండు సంవత్సరాల్లో (1978–1980) పూర్తిగా తిన్నాడు. లోహం ముక్కలను చిన్నగా కట్ చేసి, వాటిని ఆయిల్ లేదా నీటితో కలిపి తినేవాడు. ఈ విచిత్ర ఘనతకు గాను ఆయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు.

శరీరానికి ఏం కాలేదా?

చిన్న రాయి శరీరంలోకి వెళ్తేనే విలవిలలాడిపోతుంటారు. కానీ ఇంత ఇనుము తిన్నా ఏం కాలేదా? అన్న సందేహం చాలా మందికి వస్తుంది. అయితే వైద్యులు ఈయనపై పరిశోధన చేసి ఆశ్చర్యకర విషయాలను గుర్తించారు. ఆయన కడుపులో అత్యధిక ఆమ్లం (high acidity) ఉండేది. కాబట్టి ఇనుము, గాజు జీర్ణమయ్యేవి. అయితే ఆయన పండ్లు, కూరగాయలు తినేవాడు కాదు, అవి కడుపు నొప్పి కలిగిస్తాయని చెప్పేవాడు.ఇలా ఆయన శరీరం లోహాన్ని తినగలిగే విధంగా మారిపోయింది!

చివరి రోజులు

మిచెల్ లోటీతో 2007లో, 57 ఏళ్ల వయసులో సహజంగానే మరణించాడు. ఆయన జీవితంలో ఆయన సుమారు 9 టన్నుల లోహ పదార్థాలు తిన్నట్లు రికార్డులలో ఉంది.ఇనుము తిన్న మనిషి అని పిలిచే మిచెల్ లోటీతో పేరు నేటికీ ప్రపంచం గుర్తుంచుకుంటోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News