బిహార్ రాష్ట్రంలో 2025 అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది. నవంబర్ 6వ తేదీన తొలి దశ పోలింగ్ జరగనుంది. ఈ దశలో రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 121 అసెంబ్లీ నియోజకవర్గాలు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఎలక్షన్ కమిషన్ ప్రకారం మొత్తం ఓటర్ల సంఖ్య సుమారు 2.4 కోట్లు, వీరిలో మహిళలు, యువ ఓటర్లు మరియు తొలిసారి ఓటు వేయబోతున్న వారు కూడా గణనీయంగా ఉన్నారు.
తొలి దశలో 121 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. 18 జిల్లాల్లోని ప్రధానంగా పట్నా, గయా, మధుబనీ, సుపౌల్, అరారియా, మాధేపుర మొదలైన ప్రాంతాలు ఉన్నాయి. మొత్తం 45,241 పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ జరుగుతోంది. వీటిలో ప్రధానభాగం గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. ఈ దశలో 10.72 లక్షల మంది కొత్త ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో తొలిసారిగా అభ్యర్థుల ఫొటోలతో ఈవీఎంలు ఉపయోగించి పోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ భారీ ఏర్పాట్లు చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రంలో EVM మరియు VVPAT యంత్రాలు, భద్రతా బలగాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వృద్ధులు మరియు అంగవైకల్యం ఉన్న ఓటర్ల కోసం ప్రత్యేక సదుపాయాలు కూడా కల్పించారు. పోలింగ్ శాంతియుతంగా జరిగేలా రాష్ట్ర, కేంద్ర భద్రతా బలగాలు భారీగా మోహరించారు.
పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఓటర్లు తమ గుర్తింపు కార్డుతో పాటు వోటర్ స్లిప్ తీసుకుని కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఫలితాల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. ఈ తొలి దశ ఓటింగ్ రాష్ట్ర రాజకీయ దిశను నిర్ణయించే కీలక ఘట్టంగా భావిస్తున్నారు.ఈ దశలో ఆర్జేడీ నేత తేజశ్వీ యాదవ్, జేడీయూ నేత సమ్రాట్ చౌధరి నియోగజక వర్గాల్లో పోలింగ్ జరగనుంది.





