ప్రస్తుతం సమయంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రానున్న రోజుల్లో 10 గ్రాముల బంగారం రూ.2 లక్షలు అవుతుందని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే రియల్ ఎస్టేట్ రంగం కుదేలయిపోయింది. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు తగ్గిపోయాయి. దీంతో కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్న ప్రకారం.. ప్రస్తుతం తక్కువ ధరకు భూములు అందుబాటులో ఉన్నాయి. దీంతో భూములు కొనుగోలు చేయవచ్చని అంటున్నారు. అటు బంగారం ధర భవిష్యత్ లో పెరిగే ఛాన్స్ ఉండడంతో దీనిపై ఇన్వెస్ట్ మెంట్ చేయాలని అంటున్నారు. అసలు రెండింటిలో ఏదీ కొనాలి?
బంగారం పెట్టుబడి
బంగారం సురక్షిత పెట్టుబడి. ప్రస్తుతం అంతర్జాతీయంగా బంగారపు ధరలు రికార్డు స్థాయిలకు చేరుతున్నాయి. ఒక భౌతిక ఆస్తి కావాలని అనుకునేవారికి ఈ పెట్టుబడి ఎంతో సేఫ్ అని అంటున్నారు. వీటిపై పెట్టుబడలు స్టాక్, మ్యూచువల్ ఫండ్లు మాదిరిగా మార్పులు ఎక్కువ ఉండవు. పైగా చేతిలో బంగారం ఉంటే ఎప్పుడంటే అప్పుడు అమ్మేసి డబ్బు తీసుకోవచ్చు. బంగారంపై రుణాలు కూడా తీసుకోవచ్చు. ఒక కుటంబంలో బంగారు ఆభరణాలు తప్పనిసరిగా అవసరం ఉంటాయి. అందువల్ల బంగారం కొనడం మంచిది అని నిపుణులు అంటున్నారు.
అయితే బంగారం ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవని కొందరి భావన. మన ఇంట్లో కిలో బంగారం ఉంటే భద్రత కష్టమవుతుంది. పోనీ ల్యాకర్లలో ఉంచితే అదనంగా అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ట్యాక్స్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా భవిష్యత్ లో ధరలు ఎక్కువగా ఉంటే బంగారం ఎవరూ కొనలేరని కొంత మంది భావన. అంతేకాకుండా ధర ఇప్పటికే ఎక్కువ స్థాయిలో ఉంది. దీంతో బంగారం కొనేవారి సంఖ్య తగ్గుతుందని అంటున్నారు.
భూమిపై పెట్టుబడి
భారతదేశంలో భూములపై పెట్టుబడి పెట్టడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని రియల్ ఎస్టేట్ నిపుణుల సూచన. ప్రతీ కుటుంబం నివసించడానికి స్థలం అవసరం. అందువల్ల భవిష్యత్ లో భూమి డిమాండ్ పెరగడమే కానీ.. తగ్గని అంటున్నారు. అత్యవసం లేదని అనుకుంటే భూమిపై పెట్టుబడి సురక్షితమైనదని భావిస్తున్నారు. వ్యవసాయం భూములపై పెట్టుబడులు పెడితే ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఉంటాయి.
అయితే భూములపై పెట్టుబడి పెట్టడం మంచిదే.. కానీ తక్షణ ఆదాయం కావాలంటే మాత్రం వచ్చే అవకాశం ఉండదు. అంతేకాకుండా ప్రస్తుతం స్థలం ధరలు, భవన నిర్మాణాల ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. దీంతో సాధారణ ప్రజలకు ఇది దూరంగా ఉంది. ఇందులోనూ కొన్ని వివాదాస్పద భూములు ఇబ్బంది పెడుతాయి. భవిష్యత్తులో అభివృద్ధి లేకపోతే లేదా ప్రాంతం ఆశించిన వేగంగా మారకపోతే అభివృద్ధి మందగించవచ్చు. ఒక్కోసారి కొనుగోలు చేసిన ధరకు భూమి విక్రయం కాకపోవచ్చు.
ప్రస్తుతం పరిస్థితుల్లో ఏది బెటర్?
ఈ సందర్భంలో, ముఖ్యంగా భారతదేశ పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు రెండు కలిసి ప్రభావం చూపుతున్నాయి: బంగారానికి ప్రస్తుతం ఆర్థిక అస్థిరత, ఊహిత వృద్ధి లోపం, ద్రవ్యోల్బణం వంటి కారకాలు సహకరిస్తున్నాయి. దీంతో వీటి ధరలు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఆర్థిక వృద్ధి సాధిస్తే బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి. దీంతో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది. కానీ స్థలం మాత్రం అందరికీ అవసరం ఉంటుంది. అయితే బంగారం అవసరం మేరకు కొనుగోలు చేయాలి. దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే భూములపై ఇన్వెస్ట్ మెంట్ చేయాలి. అయితే అప్పులు చేసి స్థలాలు, భవనాలపై పెట్టుబడులు పెట్టొద్దు. కచ్చితంగా నివాసం కోసం ఇల్లు లేదా స్థలం కొనాలంటే మాత్రం 80 శాతం రుణం తీసుకోవచ్చు. ఈ రుణం తీర్చడానికి అవకాశాలు ఉండాలి. అప్పుడే భూమిపై పెట్టుబడి ప్రయోజనకరంగా ఉంటుంది.





