Saturday, December 6, 2025

ట్రావెల్ బస్ ఎలాంటి ఫిట్ నెస్ కలిగిఉండాలి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల ప్రజలను కలచివేసింది. ఈ ప్రమాదం బస్సు నిర్వాహకుల నిర్లక్ష్యం, డ్రైవర్ అప్రమత్తత లేకపోవడమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే చాలా వరకు జరిగే ఇలాంటి ప్రమాదాల్లో వాహనాల యజమానుల నిర్లక్ష్యం.. అధికారుల చర్యలలోపం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. అసలు ఒక ట్రావెల్ బస్సు ఎలాంటి ఫిట్ నెస్ ను కలిగి ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

Motor Vehicle Act, 1988 ప్రకారం.. ట్రావెల్ బస్సు తప్పనిసరిగా దృఢమైన ఫిట్‌నెస్ ప్రమాణాలు కలిగి ఉండాలి. మిగతా వాహనాల్లో కంటే ఇందులో ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటారు. అందువల్ల ఈ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేకుండా బస్సు రోడ్డుపై తిరగడానికి అనుమతి లేదు. ఫిట్‌నెస్ లో భాగంగా ఒక వాహనంకు సంబంధించి బ్రేకులు అత్యంత సమర్థవంతంగా , త్వరగా పనిచేసే విధంగా ఉండాలి. ముఖ్యంగా హ్యాండ్ బ్రేక్ పటిష్టంగా ఉండాలి. సిగ్నల్స్హెడ్‌లైట్లు, టెయిల్ లైట్లు, బ్రేక్ లైట్లు, ఇండికేటర్లు, ఫాగ్ లైట్లు సరిగా పనిచేయాలి. టైర్లకు తగినంత గాలి ఒత్తిడి ఉండాలి. టైర్ల ట్రెడ్ డెప్త్ సరిగ్గా ఉండాలి. అరిగిపోయిన టైర్లను వాడకూడదు. స్టీరింగ్ సులభంగా తిరిగేలా, సస్పెన్షన్ షాక్ అబ్జార్బర్‌లు ప్రయాణానికి అనువుగా ఉండాలి. అత్యవసర సమయాల్లో బస్సులో పనిచేసే అగ్నిమాపక యంత్రం , ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అత్యవసర దారి ఉండాలి. ప్రతి బస్సుకు ప్రతి సంవత్సరం రవాణా శాఖ (RTO) ద్వారా తప్పనిసరిగా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పునరుద్ధరించబడాలి.

అయితే బస్సు రోడ్డుపైకి వచ్చే ముందు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ముఖ్యంగా వాణిజ్య వాహనాలకు సంబంధించిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను ప్రాంతీయ రవాణా అధికారి కార్యాలయం జారీ చేస్తుంది.బస్సు ఫిట్‌నెస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు, RTO నియమించిన ఇన్‌స్పెక్టర్‌లు ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ టెస్టింగ్ కేంద్రాలలో లేదా మాన్యువల్‌గా బస్సును పూర్తిగా తనిఖీ చేసి, అన్ని ప్రమాణాలు పాటించిన తర్వాతే ఫిట్ నెస్ సర్టిఫికెట్ ఇస్తారు. కర్నూలు బస్ ప్రమాదంలో రాత్రి ప్రయాణాల సమయంలో అధిక వేగమే ప్రధాన కారణం అని తెలస్తోంది. వేగాన్ని నియంత్రించకపోవడం డ్రైవర్ యొక్క ప్రాథమిక నిర్లక్ష్యం కూడా కారణమనిపిస్తోంది. సుదీర్ఘ ప్రయాణాలలో డ్రైవర్‌కు సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది. 300 కి.మీ. కంటే ఎక్కువ దూరం ప్రయాణించే అన్ని ప్రైవేట్ ట్రావెల్ బస్సులకు తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలని నిబంధన విధించాలి. డ్రైవర్లు పని చేసిన సమయాన్ని (డ్రైవింగ్ అవర్స్) డిజిటల్‌గా పర్యవేక్షించాలి.హాల్టింగ్ పాయింట్స్: సుదీర్ఘ ప్రయాణాలలో నిర్ణీత వ్యవధి తర్వాత డ్రైవర్ తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా నిర్దిష్ట హాల్టింగ్ పాయింట్స్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.

సాంకేతికత ఆధారిత ఆటోమేటెడ్ ఫిట్‌నెస్ టెస్టింగ్ (AFT) కేంద్రాలను ప్రతి జిల్లాలో విస్తరించాలి. ఇక్కడ మానవ జోక్యం లేకుండా బ్రేకింగ్, లైటింగ్, సస్పెన్షన్ వంటి అన్ని అంశాలను యంత్రాల ద్వారా కచ్చితంగా తనిఖీ చేయాలి. అన్ని ప్రయాణ బస్సులలో GPS (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) స్పీడ్ గవర్నర్‌లు (వేగ నియంత్రణ పరికరం) తప్పనిసరి చేయాలి. GPS డేటాను రవాణా శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, అతివేగం నమోదు అయిన వెంటనే బస్సు ఆపరేటర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. డ్రైవింగ్ నిబంధనలను పదేపదే ఉల్లంఘించే డ్రైవర్ల లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేయాలి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య హైవేలపై అకస్మిక తనిఖీలు పెంచాలి. బస్సులు అతివేగంతో వెళ్తున్నాయా, డ్రైవర్లు నిబంధనలు పాటిస్తున్నారా, ఫిట్‌నెస్ ఉందా అని తనిఖీ చేయాలి.ఈ కఠిన చర్యలు, నిరంతర పర్యవేక్షణ ద్వారా మాత్రమే ప్రయాణ బస్సుల భద్రతను మెరుగుపరచడానికి, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి సాధ్యమవుతుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News