Saturday, December 6, 2025

గ్రీన్ కాకర్స్ తో లాభమేంటి?

దీపావళి అనగానే గుర్తుకు వచ్చేది టపాసులు. పురాణాల ప్రకారం.. దీపావళి రాత్రి మహాలక్ష్మి దేవి భూలోకంలో విహరిస్తుంది. టపాసుల వెలుగులు, శబ్దాలు ఇంటి చుట్టుపక్కల ఉన్న నెగటివ్ ఎనర్జీని, దుష్టశక్తులను దూరం చేస్తాయని విశ్వాసం ఉంది. అదే సమయంలో వెలుగులు ఇంటి చుట్టూ ఉండడం వల్ల లక్ష్మి ప్రవేశానికి శుభ వాతావరణం ఏర్పడుతుంది అని నమ్మకం. అయితే బాణసంచా కాల్చడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని ప్రకృతి ప్రేమికుల వాదన. ఇందులో భాగంగా వాతావరణ కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బాణసంచా కాల్చడం నిషేధించారు కూడా.అయితే వీటి స్థానంలో గ్రీన్ కాకర్స్ కాల్చుకోవచ్చని కొందరు చెబుతున్నారు. సాధారణ క్రాకర్స్ కంటే గ్రీన్ కాకర్స్ తో పొల్యూషన్ తక్కువగా ఉంటుందని అంటున్నారు. అంతేకాకుండా బాణసంచా నిషేధించిన ఢిల్లీలో గ్రీన్ కాకర్స్ కాల్చుకోవచ్చని సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. అసలు గ్రీన్ కాకర్స్ అంటే ఏమిటీ? సాధారణ క్రాకర్స్ కంటే ఇవి తక్కువ కాలుష్యాన్ని ఇస్తాయా?

సాధారణ క్రాకర్స్:
సాధారణంగా మార్కెట్‌లో లభించే బాణసంచాలో ఎక్కువ మొత్తంలో హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తారు. వీటి తయారీలో ప్రధానంగా బేరియం, నైట్రేట్ వాడతారు. ఇవి అత్యంత విషపూరితం. పొటాషియం క్లోరేట్ , సల్ఫర్, అల్యూమినియం వంటి లోహాలు, నైట్రేట్లు కూడా ఉంటాయి. ఇవి మండే సమయంలో అధిక మొత్తంలో పార్టిక్యులేట్ మ్యాటర్, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు వంటి ప్రమాదకరమైన వాయువులను విడుదల చేస్తాయి. శబ్ద కాలుష్యం కూడా 160 డెసిబెల్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం.

గ్రీన్ క్రాకర్స్ :
గ్రీన్ క్రాకర్లను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఆధ్వర్యంలో నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NEERI) అభివృద్ధి చేసింది. వీటి ప్రధాన ఉద్దేశం కాలుష్యాన్ని తగ్గించడం. ఇవి నీటి మాలిక్యుల్స్ విడుదల చేస్తుంది. అంటే చిన్న చిన్న నీటి బిందువులుగా ఉంటాయి. వీటితో ఆ ప్రాంతం కాలుష్యం కాకుండా కాపాడుతుంది. స్మోక్ (Safe Thermite Cracker) తక్కువగా ఉంటుంది. తక్కువ అల్యూమినియం వాడకం, తక్కువ పొగ వస్తుంది.

సాధారణ క్రాకర్స్, గ్రీన్ క్రాకర్స్ మధ్య తేడా?
సాధారణ క్రాకర్స్‌తో పోలిస్తే గ్రీన్ కాకర్స్ వాడడం వల్ల కాలుష్య ఉద్గారాలు కనీసం 30% వరకు తగ్గించిన వాళ్లవుతారు. గ్రీన్ కాకర్స్ తక్కువ పార్టిక్యులేట్ మ్యాటర్ ను విడుదల చేస్తాయి. సాధారణ క్రాకర్స్ ధ్వని కాలుష్యం160 డెసిబెల్స్ వరకు లేదా అంతకంటే ఎక్కువ ఉండగా.. గ్రీన్ కాకర్స్ 110-125 డెసిబెల్స్ పరిమితికి లోబడి ఉంటాయి. ఇవి మండేటప్పుడు నీటి ఆవిరి విడుదలయి గాలిలోకి వెళ్లే దుమ్ము ను కొంతవరకు అణచివేస్తుంది.
అయితే కొందరు గ్రీన్ కాకర్స్ అని చెప్పి సాధారణ క్రాకర్స్ ను విక్రయిస్తున్నారు. అందువల్ల గుర్తింపు ప్యాకేజింగ్‌పై CSIR-NEERI గ్రీన్ లోగో, QR కోడ్ తప్పనిసరిగా ఉండే గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కొనుగోలు చేయాలి. ఉంటాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News