తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై స్టే విధించిన హైకోర్టు.. ఎన్నికలను మాత్రం నిర్వహించుకోవచ్చు అని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పాత విధానంలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అడ్డంకులు లేవని శుక్రవారం అర్ధరాత్రి ఉత్తరులను జారీ చేసింది. ప్రస్తుతం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలును మాత్రమే నిలిపివేస్తున్నామని.. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ అమలను నిలుపుదల చేయడం లేదని వెల్లడించింది. ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం పాత విధానంలో అంటే.. బీసీలకు 25%, ఎస్సీలకు 15%, స్త్రీలకు పరిశోధన చొప్పున రిజర్వేషన్లు కేటాయిస్తూ ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని స్పష్టం చేసింది. పాద పద్ధతిలో సీట్ల రిజర్వేషన్ ప్రక్రియను సవరించి ఆమెకు రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికల ప్రక్రియను కొనసాగించవచ్చని తెలిపింది.
అయితే గురువారం స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల విడుదల చేసిన స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్లు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. గురువారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 119 మంది నామినేషన్లు వేశారు. కానీ ఎన్నికల ప్రక్రియ నిలిపివేయడంతో వారి విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ శుక్రవారం అర్ధరాత్రి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో మళ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆశ రాజకీయ నాయకుల్లో కలుగుతోంది.
మరోవైపు గురువారం చెప్పిన తీర్పులో మరో నోటిఫికేషన్ వచ్చే వరకు ఎన్నికల కార్యకలాపాలు ఆగిపోతాయని స్పష్టం చేసిన నేపథ్యంలో.. శుక్రవారం వెలువడిన ఉత్తర్వుల ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? లేదా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తే అధికారికంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
మరోవైపు ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. మరి కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.





