కురుమల ఆరాధ్య దైవం భక్త కనకదాసు విగ్రహావిష్కరణ ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత హాజరయ్యారు. విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత ఆమె పలు విషయాలు కురుమల గురించి మాట్లాడారు. మన కురుమల అందరికీ మూల స్తంభం అయిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధి రామయ్య గారు కురుమ కులానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. భారతదేశంలో కురుమలు అభివృద్ధి చెందాలని ఎంతో కాలంగా ఆరాటపడుతున్న కర్ణాటక రాజకీయ పెద్దలు రేవన్న గారు బెంగళూరు నుంచి కనకదాసు విగ్రహావిష్కరణకు ఇక్కడికి రావడం ఎంతో సంతోషకరమని అన్నారు. అలాగే కురుమ కుల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న ఎంపీ పార్థసారథి గారికి ధన్యవాదములు అని తెలిపారు.
మన ఆరాధ్య దైవం కనకదాసు విగ్రహం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇక్కడ ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవకాశం నాకు కల్పించిన తిరుపతి కమిటీ సభ్యులకు ధన్యవాదములు అని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా ఇక్కడ భక్త కనకదాస్ విగ్రహం పెట్టాలని ఎంతో కృషి చేశారు.. ఆ కల ఇప్పటికి నెరవేర్చారు. అని అన్నారు. గాయకుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న అయినా కురుమ కులంలో జన్మించడం ఎంతో అదృష్టమని అన్నారు.పూర్తి స్పీచ్ ను ఈ వీడియోలో చూడండి..





