హైదరాబాద్ ను వర్షం ముంచేత్తుతోంది. గత నెల రోజులుగా విపరీతంగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులు నిండిపోయాయి. ఈ క్రమంలో మూసీ నదిపై ఉన్న హుస్సేన్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో ఇటీవల ఈ ప్రాజెక్టు గేట్లను ఓపెన్ చేశారు. దీంతో వరద ఉప్పొంగి ప్రవహించింది
ఫలితంగా మూసి పరివాహక ప్రాంతాలు నీటితో మునిగిపోయాయి. హైదరాబాద్ నగరంలోని పురాణా పూల్ వద్ద మూసీ నది 13 అడుగుల మేర ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. అంతేకాకుండా పోటీలోని ఆసుపత్రి వద్దకు నీరు చేరడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మూసీ నది ఉవ్వెత్తున ప్రవహించడంతో చాదర్ఘాట్ ప్రాంతం దాదాపు వరదనీటితో ముంచెత్తింది. దీంతో చాలామంది పునరావస కేంద్రాలకు తరలి వెళ్లారు. మరికొందరు ఇళ్లలోనే ఉండిపోయారు. వీరికి శనివారం ప్రభుత్వం డ్రోన్ల ద్వారా ఆహారాలు పంపించారు. అలాగే మూసి పరివాహక ప్రాంతాలను డ్రోన్ల ద్వారా చిత్రీకరించారు. ఈ సందర్భంగా మూసి ఉదృతంగా ప్రవహిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఈ కింద ఉంది వీక్షించండి..





