స్వచ్చతా హీ సేవా 2025 కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ నగరంలోని లోయర్ మానేరు డ్యాం సమీపంలో ” ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్” నివాదంతో పరిశుభ్రత పనుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్డు రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. చీపురు పట్టి మానేరు డ్యామ్ పరిసరాలు శుభ్రం చేశారు. విద్యార్థులతో కలిసి మానేరు పరిసరాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలను స్వయంగా తొలగించారు..

ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ,నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫూల్ దేశాయ్ , సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు పాల్గొని పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ స్వచ్చతా హీ సేవా 2025 కార్యక్రమంలో బాగంగా అన్ని మున్సిపాలిటీ ,గ్రామాల్లో ప్రతి ఒక్కరు పరిసరాలను శుభ్రం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రజల సహకారం కావాలని, అప్పుడే ఇవి విజయవంతం అవుతాయని చెప్పారు.






