బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శ్రీవారు కృష్ణుడి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్న శేష వాహనంపై ఊరేగారు. గురువారం ఉదయం నుంచి శోభయాత్ర నిర్వహించడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఈరోజు సాయంత్రం హంసవాహనంపై ఊరేగించనున్నారు. ఇదిలా ఉండగా తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. ఉచిత దర్శనం కోసం 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వ దర్శనం 8 గంటల సమయం పడుతోంది. బుధవారం స్వామివారిని 56,628 మంది భక్తులు దర్శించుకున్నారు.








