Saturday, December 6, 2025

పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేస్తున్నారా?

ఈరోజుల్లో ఉద్యోగం, వ్యాపారం చేయడం కంటే పిల్లలను పెంచడమే పెద్ద ప్రయాసగా మారింది. ఎందుకంటే ఒకప్పటి కాలంలో తల్లిదండ్రులు పట్టించుకున్నా.. పట్టించుకోకపోయినా వారు ఎలాగోలా చదువుకొని జీవితంలో ఉన్నత స్థానానికి వచ్చారు. కానీ నేటి కాలంలో ప్రత్యేకంగా వారిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అయితే ఒక్కోసారి ఎంత శ్రద్ధ తీసుకున్న బయటకు వెళ్లినప్పుడు లేదా స్నేహితులతో కలిసినప్పుడు కొన్ని అలవాట్లను ఏర్పరచుకుంటున్నారు. ఇవి ఒక వంతు అయితే.. మరో వంతు వారు మొబైల్ లేకుండా ఉండడం లేదు. దాదాపు ఎక్కువ శాతం మంది విద్యార్థులు స్కూల్ లేదా కాలేజీ నుంచి ఇంటికి రాగానే చిందరవందరగా చెప్పులు విడిచి.. బ్యాగు ఎక్కడో పడేసి.. ముందుగా సెల్ పడతారు. ఆ తర్వాత గంటల తరబడి మొబైల్ చూస్తూనే ఉంటారు.. ఒకరకంగా ఆహారం తినాలని అనిపించినా.. మొబైల్ చూసిన తర్వాతే వీటిని చేయాలని అనుకుంటారు. అయితే ఇలా చేయడం వల్ల వారు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అసలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే పిల్లలు ఏం చేయాలి? ఇలాంటి ప్రణాళిక వేసుకోవాలి?

స్కూల్ నుంచి ఇంటికి రాగానే విద్యార్థుల మొబైల్ చూస్తే..


పఠనంలో అంతరాయం:
అంటే హోంవర్క్, రివిజన్ వదిలేసి మొబైల్‌లో గేమ్స్, వీడియోలలో టైమ్ వేస్ట్ అవుతుంది.

కళ్ల సమస్యలు: స్క్రీన్ ఎక్కువసేపు చూస్తే కళ్లకు మంట, బలహీనత, కంటిచూపు తగ్గడం జరుగుతుంది.

దృష్టి కేంద్రీకరణ తగ్గిపోవడం: చదువుపై దృష్టి పెట్టలేకపోవడం, మెమరీ తగ్గిపోవడం.

శారీరక ఆరోగ్యం : కూర్చొని మొబైల్ వాడటం వల్ల వ్యాయామం, ఆటలు తగ్గిపోతాయి → స్థూలకాయం (obesity), అలసట వస్తాయి.

మానసిక ఆరోగ్యం: ఎక్కువసేపు మొబైల్ వాడితే ఆందోళన, చిరాకు, డిప్రెషన్ లాంటి సమస్యలు రావచ్చు.

నిద్ర లోపం : రాత్రిళ్లు స్క్రీన్ వాడితే మెదడు రిలాక్స్ కాకపోవడం వల్ల తగిన నిద్ర రాదు.

మరేం చేయాలి?

విశ్రాంతి తీసుకోవడం : స్కూల్ నుంచి వచ్చాక చేతులు కడుక్కోవడం, యూనిఫాం మార్చడం చాలా ముఖ్యం. 15–20 నిమిషాలు రిలాక్స్ అయ్యేలా తినటానికి తేలికపాటి అల్పాహారం లేదా పండు తీసుకోవాలి.

హోంవర్క్ & పఠనం : అలసట తగ్గిన తర్వాత హోంవర్క్ పూర్తి చేయాలి. ఆ తరువాత ఆ రోజు క్లాస్‌లో నేర్చుకున్న విషయాలను రివైజ్ చేయడం ఉపయోగకరం.

ఆటలు / వ్యాయామం : ఒక గంటపాటు బయటి ఆటలు లేదా ఇంట్లో ఫిజికల్ యాక్టివిటీలు చేయడం శరీరానికి, మనసుకి మంచిది.

కుటుంబంతో సమయం : తల్లిదండ్రులతో మాట్లాడడం, వారి రోజు ఎలా గడిచిందో చెప్పడం వల్ల బంధం బలపడుతుంది.

పుస్తక పఠనం / అభిరుచులు : కథా పుస్తకాలు చదవడం, డ్రాయింగ్, మ్యూజిక్ లాంటి హాబీలు కొనసాగించవచ్చు.

రాత్రి చదువు : డిన్నర్ తర్వాత కొంత సమయం చదువుకు కేటాయించడం వల్ల మరుసటి రోజు క్లాసులో బాగా అర్థమవుతుంది.

తగిన నిద్ర : స్కూల్ పిల్లలకు రోజుకు 8–9 గంటలు నిద్ర తప్పనిసరి.

రోజువారీ టైమ్‌టేబుల్ ఇలా తయారు చేసుకోవచ్చు..

సాధారణంగా స్కూల్ ఉదయం 9 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటలకు పూర్తవుతుంది.

ఉదయం 6:30 : లేవడం, ముఖం కడుక్కోవడం, ఫ్రెష్ అవ్వడం

7:00 AM – వ్యాయామం / యోగా / ప్రాణాయామం (15–20 నిమిషాలు)

7:30 AM – అల్పాహారం

8:00 AM – 8:30 AM – ఆ రోజు పాఠాలు త్వరగా రివైజ్ చేయడం

8:30 AM – 9:00 AM – స్కూల్‌కు రెడీ అవ్వడం

స్కూల్ టైమ్

9:00 AM – 4:00 PM – స్కూల్

స్కూల్‌ తర్వాత

4:00 PM – 4:30 PM – ఇంటికి వచ్చి చేతులు కడుక్కోవడం, యూనిఫాం మార్చుకోవడం

4:30 PM – 5:00 PM – తేలికపాటి నాస్టా / పాలు, పండ్లు తినడం

5:00 PM – 6:00 PM – ఆటల సమయం (బయట గేమ్స్ లేదా ఫిజికల్ యాక్టివిటీలు)

6:00 PM – 7:30 PM – హోంవర్క్ + ఆ రోజు పాఠాలను రివైజ్ చేయడం

7:30 PM – 8:00 PM – డిన్నర్

8:00 PM – 8:30 PM – కుటుంబంతో సమయం, టీవీ / చిన్న విశ్రాంతి

8:30 PM – 9:15 PM – తదుపరి రోజు పాఠాలు చదవడం / రివైజ్ చేయడం

9:15 PM – 9:30 PM – కథా పుస్తకం చదవడం / హాబీలు (డ్రాయింగ్, మ్యూజిక్, మొదలైనవి)

9:30 PM – 10:00 PM – నిద్రకు సిద్ధం అవ్వడం

10:00 PM – నిద్ర

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News