హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బుధవారం రోజున పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ జిల్లాలో వర్షాలు ఉంటాయని తెలిపింది.
బుధవారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లాలో మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.గురు, శుక్రవారాల్లో కూడా రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.హైదరాబాద్ లోనూ రాత్రి వర్షం కురిసే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఉండొచ్చని అధికారులు తెలిపారు.





