Saturday, December 6, 2025

మ్యారేజ్ డిటెక్డివ్.. వీరు ఏం చేస్తారు?

పెళ్లి చేసుకునేటప్పుడు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని అంటారు. పూర్వకాలంలో ఒక వివాహం చేసే సమయంలో ఎన్నో పరిశీలనలు చేసి.. సంప్రదింపులు జరిపి.. ఇద్దరు వ్యక్తులను కలిపేవారు. కానీ నేటి కాలంలో కనురెప్ప మూసినంత సేపట్లో వివాహం జరిగిపోతుంది. అయితే అలా వివాహం జరిగినా.. మళ్లీ అంతే స్పీడులో విడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఉండకుండా కొందరు తల్లిదండ్రులు అబ్బాయి లేదా అమ్మాయి గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వివాహం చేయాలని అనుకుంటున్నారు. ఇందుకోసం డిటెక్టివ్ ఏజెన్సీలను సంప్రదిస్తున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని డిటెక్టివ్ ఏజెన్సీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఢిల్లీ, కోల్లో కతా, హైదరాబాద్ వంటి నగరాల్లో ఇవి పనిచేస్తున్నాయి. అసలు ఈ డిటెక్టివ్ ఏజెన్సీ ఏం పని చేస్తుంది? దీని నిర్వహణ ఎవరు చూస్తారు?

నేటి కాలంలో పెళ్లిళ్లు కూడా ఒక పెద్ద ప్రయాసగా మారింది. ఎందుకంటే తల్లిదండ్రులు సూచించే వారి కంటే చాలామంది యువత ఎవరికి వారే వివాహ నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో పొరపాటు చేస్తున్నారు. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియకుండా పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత వారి గురించి తెలిశాక బాధపడుతున్నారు. ఇలాంటి సమస్య ఉండకూడదని ప్రస్తుతం డిటెక్టివ్ ఏజెన్సీలను సంప్రదిస్తున్నారు.

ఇలా పెళ్లిళ్లు జరిగే ముందు వ్యక్తుల గురించి పూర్తిగా సమాచారం సేకరించడానికి ఈ డిటెక్టివ్ ఏజెన్సీలు పనిచేస్తాయి. వీటిలో ఢిల్లీలోని తేజస్ డిటెక్టివ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఢిల్లీకి చెందిన భావన ఒకప్పుడు జర్నలిస్టుగా పనిచేసేవారు. అయితే ఆ తర్వాత కొన్ని సంఘటనలు చూసి పెళ్లి సంబంధాల విషయంలో పకడ్బందీగా ఉండేందుకు డిటెక్టివ్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. ఎవరైతే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారో… వారు లేదా వారి తల్లిదండ్రులు ఈ డిటెక్టివ్ ఏజెన్సీని సంప్రదిస్తారు. మీరు అమ్మాయి లేదా అబ్బాయి గురించి పూర్తిగా సమాచారం సేకరిస్తారు. అవసరమైతే ఇతర డిటెక్టివ్ ఏజెన్సీల సహాయం కూడా తీసుకుంటారు. ఇలా ఒక వ్యక్తి గురించి పూర్తిగా సమాచారం సేకరించి తల్లిదండ్రులకు అందిస్తారు. ఇందుకోసం వారు ప్రత్యేకంగా ఫీజును వసూలు చేస్తారు. ఇలా దేశంలోని ప్రధాన నగరాల్లో డిటెక్టివ్ ఏజెన్సీలు పనిచేస్తాయి.

ఈ ఎంక్వయిరీలో ఒక అబ్బాయి జీతం ఎంత? అతని కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనే విషయాలపై పూర్తిగా సమాచారం సేకరిస్తారు. అంతేకాకుండా వ్యక్తులు చెప్పే సమాచారం నిజమైన దేనా? అనే విషయాలను కూడా సాంకేతికంగా కనుగొంటారు. అయితే పెళ్లికి ముందు ఇలా సమాచారం సేకరించినా.. పెళ్లయిన తర్వాత ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచుకొని.. ముందుకు వెళ్లాలని.. అంతేకాకుండా పెళ్లి అనేది ఒక నమ్మకం పైనే ఆధారపడి ఉంటుందని మరికొందరు అంటున్నారు. కానీ దూరపు వ్యక్తుల గురించి తెలుసుకోవడానికి ఈ డిటెక్టివ్ ఏజెన్సీ ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News