బంగారం ధరలు నిన్న తగ్గినట్టే తగ్గి మరోసారి భారీగా పెరిగాయి. బంగారం విలువ ఎప్పటికీ తగ్గదు అనడానికి ఇదే నిదర్శనం. అటు వెండి ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయి. అయితే బులియన్ మార్కెట్ ప్రకారం సెప్టెంబర్ 16వ తేదీ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
దేశ వ్యాప్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,11,930.. 22 క్యారెట్ల బంగారం రూ. 1,02,600గా ఉంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,11,930 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,600 గా ఉంది. సోమవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,11,060 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,800 గా ఉంది. అంటే నిన్నటి కంటే ఈరోజు 22 క్యారెట్ల బంగారం రూ.800 పెరగగా.. 24 క్యారెట్ల బంగారం రూ.870 పెరిగింది. వివిధ నగరాలను పరిశీలిస్తే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ముంబైలో రూ. 1,11,930.. చెన్నై రూ.1,12,150, బెంగళూరు రూ.1,11,930, ఢిల్లీ రూ. 1,12,080, కోల్ కతా 1,11,930 గా ఉంది.
వెండి ధరల్లోకి వెళితె.. కిలో వెండి హైదరాబాద్ లో రూ. 1,44,000 పలుకుతోంది. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పరిస్థితుల కారణంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చతగ్గులు కొనసాగుతున్నాయి. బంగారంపై ఎక్కువ మంది ఇన్వెస్టర్లు ముందుకు రావడంతో దీనికి డిమాండ్ పెరుగుతోంది. అయితే ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనాలంటే భయపడుతున్నారు.





