జీవితంలో ఎదగాలంటే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు. వీటిలో కమ్యూనికేషన్ తప్పనిసరి అని కొందరు మేధావులు సూచనలు ఇస్తుంటారు. ఎదుటివారితో ఎలా మాట్లాడడం.. వారిని మాటలతో ఆకట్టుకోవడం.. వంటివి నేర్చుకోవాలని అంటుంటారు. మాట బాగుంటేనే అన్ని రకాలుగా జీవితం బాగుంటుందని చెబుతారు. కానీ ఏమాత్రం మాట్లాడకుండా కేవలం ఆహా భావాలతో ఎదుటివారిని మెప్పించగానే శక్తి కొందరికి మాత్రమే ఉంటుంది. ఒకప్పుడు చార్లీ చాప్లిన్ తన యాక్షన్ తో ఇటువంటి మాట లేకుండా అందరిని నవ్వించాడు. అదే స్ఫూర్తితో ఇప్పుడు మరో వ్యక్తి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఒక మాట కూడా మాట్లాడకుండా ప్రేక్షకులను నవ్విస్తూ మొత్తం 250 మిలియన్ల ఫాలోవర్స్ ను పెంచుకున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు?
Khaby Lame.. ఈ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండీగా ఉంది. ఇటీవల కొందరు ఇంస్టాగ్రామ్ లో కొన్ని విలువైన మాటలు చెబుతూ అందరిని ఆకట్టుకుంటున్నారు. కానీ ఈయన మాత్రం తన యాక్షన్ తోనే ఎదుటివారిని నవ్విస్తున్నాడు. కబీ లామే ఇటలీకి చెందిన వాడు. కరోనా సమయంలో 2020 మార్చిలో ట్యూరిన్ సమీపంలోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అతడు తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. అప్పటినుంచి అతడు టిక్ టాక్ వీడియోలు చేయడం ప్రారంభించాడు.
అయితే అందరిలాగా కాకుండా భిన్నంగా తన వీడియోలో లైఫ్ Hacks.. అంటే జీవితంలో ఎన్నో క్లిష్టమైన సమస్యలను సులభతరంగా పరిష్కరించుకోవచ్చు అని తన చేష్టల ద్వారా తెలుపుతుంటాడు. చేతులు పైకి ఎత్తడం.. కళ్ళను పెద్దగా చూసి చూపించడం.. వంటివి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే అతడు చేసే వీడియోలు ఏ దేశ లాంగ్వేజ్కి సంబంధించినది కాకపోవడంతో ప్రపంచంలో చాలామంది ఇతని వీడియోలను చూడడం ప్రారంభించారు. దీంతో అతడు వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యాడు. టిక్ టాక్ లో 160 మిలియన్ ఫాలోవర్స్.. ఇంస్టాగ్రామ్ లో 80 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో అతనికి 250 మిలియన్స్ ఫాలోవర్స్ అయ్యారు. దీంతో అతని సంపాదన 2025లో 20 మిలియ్ డాలర్లు.. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం..176 కోట్ల రూపాయలు.
జీవితంలో ఏదైనా సాధించడానికి ప్రత్యేకంగా కొన్ని సౌకర్యాలు ఉండాలని అంటుంటారు. అలా ఎటువంటి సౌకర్యాలు లేకుండా కూడా ఉన్నత స్థాయిలో రాణించవచ్చు అనడానికి ఇతని స్టోరీయే నిదర్శనం..





