Saturday, December 6, 2025

‘ఇందిరమ్మ’ చీరెలు సిద్ధం.. 23 నుంచే పంపిణీ..ఎక్కడంటే?

తెలంగాణ రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం దసరా కానుకగా చీరల పంపిణీ చేపట్టనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 23 నుంచి చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపింది. మొదట్లో ఒక్కరికి రెండు చీరలు ఇవ్వాలి అని అనుకున్నప్పటికీ.. దసరాకు ఒకటి.. సంక్రాంతికి మరొక చీర ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 50 లక్షల చీరలు పూర్తి అయ్యాయని.. మరో 10 లక్షల చీరల ఉత్పత్తి పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చీరలు ఒక్కోదానికి రూ. 800 వందలు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేయనున్నారు. ఈ చీరలు బ్లూ కలర్.. డార్క్ బ్లూ అంచుతో తయారు చేశారు. బ్లౌజ్ తో కలిపి ఈ చీర 6.3 మీటర్లు ఉండనుంది. సీనియర్ సిటిజెన్లకు 9 మీటర్ల చీరలు అందజేయనున్నారు.

గత ప్రభుత్వ హయాంలో ప్రతి బతుకమ్మ సందర్భంగా చీరల పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ చీరలను నిలిపివేసింది. ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ మహిళా శక్తి పేరిట చీరలు పంపిణీ చేయనుంది. అయితే గత ప్రభుత్వం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి చీర పంపిణీ చేయగా.. ప్రస్తుతం మహిళా సంఘాల సభ్యులకు చీరలను పంపిణీ చేస్తుంది. ఈనెల 23 నుంచి అన్ని జిల్లాల్లో చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నారు. గతంలో చీరలను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయగా.. ప్రస్తుతం స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా సభ్యులకు అందించనున్నారు.

ఈ చీరలను సిరిసిల్ల నేత కార్మికులు తయారు చేశారు. ఆరు నెలల పాటు 35 కోట్ల మీటర్లను తయారు చేసినట్లు సమాచారం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News