హుస్నాబాద్ : హుస్నాబాద్ నియోజకవర్గం వెన్కేపల్లి- సైదాపూర్ మండలంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇందులో భాంగా మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంకు ను పంపిణీ చేశారు. మండలంలోని ఆకునూరు గ్రామంలో కేజీబీవి పాఠశాలలో 90 లక్షల రూపాయల అంచనా వ్యయంతో డార్మెంటరీ హాల్ .. భవన మరమత్తులు.. మురికి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన.. 5 లక్షల రూపాయల తో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశారు.. వేంకటేశ్వర్లపల్లి లో 5 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఓపెన్ జిమ్ ప్రారంభించారు.. బూడిదపల్లిలో 5 లక్షల రూపాయల వ్యయంతో ఓపెన్ జిమ్ ప్రారంభం..12 లక్షల రూపాయల వ్యయంతో నూతన అంగన్వాడీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశారు.. ఎక్లాస్ పూర్ లో రూ. 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. మహిళా సంఘాలకు స్టీల్ బ్యాంక్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే,లక్ష్మీ కిరణ్ ,మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎక్లాస్ పూర్ లో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. మీ గ్రామాల్లో ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తున్నామన్నారు. గ్రామాల్లో రోడ్లు,నాళాలు, అంగన్వాడీ భవనాలు ,గ్రామ పంచాయతీ భవనాలు ఇలా అభివృద్ధి పనులు ప్రారంభించుకుంటున్నామన్నారు. యూరియా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని.. కేంద్రం యూరియా తగినంత సరఫరా చేయాలని కేంద్రమంత్రులకు పలుమార్లు విజ్ఞప్తి చేశామని అన్నారు. రైతులు ఆందోళన చెందవద్దని, యూరియా సమస్య తీరుతుందని చెప్పారు.





