ప్రస్తుత కాలంలో కొంతమంది ఆడపిల్ల పుడితే భారంగా ఫీల్ అవుతున్నారు. మరికొందరు మాత్రం మా ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని అనుకుంటున్నారు. కొంతమంది సంతానం కాని వారు ఎవరైనా మాకు మహాభాగ్యమే అని అనుకుంటున్నారు. అయితే ఒక్క ఆడపిల్ల వల్ల ఒక ఊరి పరిస్థితి మొత్తం మారిపోయింది. అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా ఉన్న ఆ ఊరి కరువు ఉంటే.. ఇప్పుడు ఈ ఆడపిల్లతోనే ఎటు చూసినా చెట్లే కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ ఆడపిల్ల ఏం చేసింది? ఆ గ్రామ పరిస్థితి ఎటు నుంచి ఎటు మారింది? ప్రతి ఆడపిల్ల ఉన్న కుటుంబాలు తెలుసుకోవాల్సిన స్టోరీ ఇది..
రాజస్థాన్ రాష్ట్రం రాజసమంద్ జిల్లాలో పిప్లాంట్రీ అనే గ్రామం ఉంది. ఈ గ్రామం ఒకప్పుడు కరువుతో ఉండేది. అంతేకాకుండా ఈ గ్రామంలో అధిక ఉష్ణోగ్రత ఉండేది. ఈ ఉష్ణోగ్రత వల్ల చాలామంది డిహైడ్రేషన్కు గురై చనిపోయారు. అలాగే ఈ గ్రామంలో నివసించే శ్యాంసుందర్ పాలివాల్ అనే కూతురు కిరణ్ డిహైడ్రేషన్ వల్ల చనిపోయింది. అయితే ఇలా చనిపోవడం అక్కడ సాధారణమే అయినా.. శ్యాంసుందర్ మాత్రం తీవ్రంగా ఆవేదన చెందాడు. ఆడపిల్ల ఉన్న తండ్రికి ఇలాంటి బాధలు రాకుండా ఉండాలని అనుకున్నాడు.

ఇందులో భాగంగా ఆయన 2026వ సంవత్సరంలో ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా.. 111 మొక్కలు నాటడం ప్రారంభించాడు. కేవలం ఈ మొక్కలు నాటడమే కాకుండా ప్రతి ఆడపిల్ల బాధ్యత నాది అంటూ కుటుంబ సభ్యులతో ఆఫిడవిట్ రాయించుకున్నాడు. అంతేకాకుండా ప్రతి ఆడపిల్ల పై రూ.31,000 డిపాజిట్ చేయించాడు. ఇలా ఆ గ్రామంలోని చాలామంది ఆడపిల్లలు ఉన్నత చదువులు చదివి.. స్వతంత్రంగా జీవించగలుగుతున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకు గ్రామంలో మూడు లక్షల కంటే ఎక్కువ చెట్లు ఉన్నట్లు అంచనా. ఇలా ఇప్పుడు ఆ గ్రామం చెట్ల మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది.

ఇంతటి మంచి ఆలోచన కలిగిన శ్యాంసుందర్ ను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా 2021 సంవత్సరంలో ఆయనకు పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అంతేకాకుండా ఆయన అనేక అవార్డులు కూడా పొందారు. పిప్లాంట్రీ గ్రామం కోసం శ్యాంసుందర్ తీసుకున్న నిర్ణయంతో ప్రతి ఒక్క ఆడపిల్ల విలువ ఎంతో ఉందని తెలుస్తుంది. అంతేకాకుండా చెట్లు ఉండడం వల్ల మానవాళికి ఎంతో ఉపయోగపడతాయని ఈ గ్రామం ద్వారా తెలుస్తుంది.






