Saturday, December 6, 2025

నా కోసం ఒక్క ఫోన్ చేయవా అన్నా..కల్వ కుంట్ల కవిత బావోద్వేగం..

కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తరువాత బుధవారం ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా తాను మంచి చేస్తే.. పార్టీ నుంచి సస్పెండ్ చేశారని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడతూ ‘ బీసీల కోసం నేను పోరాటం చేస్తుంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. బీసీలకు న్యాయం చేయాలని అంటుంటే పార్టీలో ఉన్న కొందరు పనిగట్టుకొని నా మీద చాలా దారుణమైన ప్రచారం చేశారు. కేసీఆర్ లాగే నేను కూడా సామాజిక తెలంగాణ సాధన కోసం కట్టుబడి ఉన్నా.. కేసీఆర్ ఈ ప్రాణాన్ని భిక్షగా ఇచ్చారు. నా తండ్రి చిటికన వేలు పట్టుకొని నేను ఓనమాలు నేర్చుకొని ఉద్యమాలు చేశా.. ప్రజా సమస్యలు అంటే ఏంటో నాకు బాగా తెలుసు. భారతదేశం మొత్తంలో ఉన్న మఖ్యమంత్రుల్లో దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పినటువంటి ఏకైక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు.. దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.. అలాంటి కేసీఆర్ గారు అంటే నాకు ఎంతో గౌరవం..’

నా కోసం ఒక్క ఫోన్ చేయవా.. అన్నా..

‘నేను పార్టీ భవన్లోకి పోయి కూర్చుని ప్రెస్ మీట్ పెట్టినా.. ఎక్కడో బయట పెట్టలేదు. ఈ సందర్భంగా ఒక చెల్లిగా అడుగుతున్నా.. నామీద కుట్రలు జరుగుతున్నాయని చెప్పినా.. కానీ నాకోసం ఒక్క ఫోన్ అన్న చేయవా అన్నా.. బంధాలు, బంధుత్వాలు పక్కనబెడుదాం.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా.. పార్టీలోని ఒక మహిళపై కట్రల జరుగుతున్నాయని చెబితే పట్టించుకోవా..? కేసీఆర్ బిడ్డగా నా పరిస్థితే ఇలా ఉంటే..సాధారణ మహిళ నాయకుల పరిస్థితి ఏంటి? నామీద కుట్రలు జరుగుతున్నాయని చెప్పిన తరవాత కేసీఆర్ నుంచి ఎలాంటి ఎక్స్ పెక్టేషన్ చేయలేదు. ఎందుకంటే ఆయనకు ఎన్నో పనుల ఉంటాయి.. తెలంగాణ కోసం నిత్యం శ్రమిస్తూ ఉంటాడు. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఒక్క ఫోన్ రాకపోవడం చాలా బాధగా అనిపించింది. ’

ఆ మహిళా నాయకులను అభినందిస్తన్నా..

‘నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తరువాత కొంతమంది మహిళా నాయకులు ప్రెస్ మీట్ పెట్టి నా గురించి మాట్లాడారు. వారు నాపై ఏ విధంగా మాట్లాడినా నేనేం బాధపడను. కానీ మొదటిసారీ కొందరు మహిళా నాయకుల స్వతంత్రంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. నేను ఈ స్వతంత్రమే కోరుకున్నా.. ఇలా ప్రతి ఒక్కరికి పార్టీలో స్వతంత్రం ఉండాలనే కొరుకుంటున్నా.. ’

అన్నా.. హరీష్ తో జాగ్రత్త..

‘కేసీఆర్ గారూ పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నారు. కానీ పార్టీలో ఉండి డబ్బలు సంపాదించుకోవాలని కొంత మంది చూస్తున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ కుటుంబాన్ని విచ్చిన్నం చేయాలని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా మొదట నన్ను బయటకు పంపారు. నేను ఇప్పటికీ చెబుతున్నా.. కొంత మంది కేసీఆర్ చుట్టూ ఉండేవారితో జాగ్రత్తగా ఉండాలని రామన్నకు నేను సూచిస్తున్నా.. వీరు కేసీఆర్ పై ఎలాంటి ప్రేమను చూపించడం లేదు. కేవలం వ్యక్తిగత లాభంతోనే ఉన్నారు. ’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News