Royal Challenge Bangalore (RCB)తాజాగా తొక్కిసలాట బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. దాదాపు రెండు నెలల కిందట జరిగిన ఈ సంఘటనపై తాజాగా ఈ జట్టు యాజమాన్యం మౌనం వీడి ప్రకటన చేసింది. ‘ఆర్సీబీ కటుంబంలో 11 మందిని కోల్పోయాం.. వారి స్థానాన్ని భర్తీ చేయలేం. కానీ వారి కుటంబాల్లో ఒక్కొక్కరికి మొదటి అడుగుగా రూ. 25 లక్షలు ఇచ్చాం’ అని ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. అయితే ఇప్పటికే ఈ సంఘటనపై కర్ణాటక రాష్ట్ర మఖ్యమంత్రి ప్రభుత్వం తరపున రూ.25 లక్షలు ప్రకటించారు. అసలేం జరిగింది?

2025 ఐపీఎల్ టైటిల్ ను Royal Challenge Bangalore (RCB) గెలుచుకుంది. తొలిసారి టైటిల్ ను గెలుచుకోవడం ద్వారా బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం నంచి విధాన సౌధ వరకు ర్యాలీ తీయడానికి ఏర్పాట్ల చేస్తన్నారు. అయితే ఈ స్టేడియం వద్దకు ఒక్కసారిగా భారీగా క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. దీంతో ఇక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 11 మంది మరణించారు. అయితే ఉచిత టికెట్ల పుకారుతో ఇక్కడికి భారీగా అభిమానుల తరలివచ్చినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ సంఘటన తరువాత కర్టాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. సరైన ప్రణాళిక లేకుండా ఈవెంట్ ను రెడీ చేసినందుకు ఈవెంట్ మేనేజ్ మెంట్ తో పాటు ఆర్సీబీ, కేఎస్ సీఏ, నగర పోలీసులపై క్రిమినల్ కేసలు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే మూడు నెలల గడిచిన తరవాత ఆర్సీబీ స్వయంగా స్పందించింది. ఈ సందర్భంగా బావోద్వేగ పోస్టుతో పరిహారంఇచ్చినట్ల ప్రకటించింది. ‘దు:ఖంలో ఉన్న కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందించినప్పటికీ వారికి అండగా ఉంటాం.. బాధితులను ఎప్పటికైనా ఆర్సీబీ కుటుంబంలోని సభ్యులుగానే భావిస్తాం..’ అని పేర్కొంది. అయితే ఈ సంఘటన తరువాత ఐసీసీ మహిళల వన్డే కప్ ను బెంగళూరు నుంచి ముంబైకి మార్చారు.





