మీ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితె ఎవరు గెలుస్తారు? ఎవరైనా టక్కున సమాధానం చెప్పడానికి తడబడుతూ ఉంటారు. అయితే నోటి మాట ద్వారా ఫలానా వ్యక్తి అని చెప్పవచ్చు. కానీ రాష్ట్రంలో ప్రజలు ఎవరి మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు? అనే విషయాలను తెలిపేందుకు ప్రతీ ఏడాది రెండు సార్లు కొన్ని మీడియా సంస్థలు సర్వే నిర్వహిస్తాయి. దీనినే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ అని అంటారు. తాజాగా 2025 ఆగస్టుకు సంబంధించిన సర్వేను ఇండియా టుడే- సీ ఓటర్ కలిసి ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో అత్యంత ప్రజాధారణ పొందిన సీఎం ఎవరు? తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ స్థానంలో ఉన్నారు?
ఇండియా టుడే- సీ ఓటర్ కలిసి 2025 జూలై 1 నుంచి ఆగస్టు 14 వరకు నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వే ప్రకారం.. దేశంలో అత్యంత ప్రజాధారణ పొందిన సీఎంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ నిలిచారు. ఈ సర్వేలో అతడిని 36 శాతం మంది ఇష్టపడ్డారు. ఆ తరువాత పశ్చిమ బెంగాల్ ముఖ్యంత్రి మమతా బెనర్జీని 13 శాతం మార్కులు పడి 2వ స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో ఆంధ్రప్రదేశ్ మఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 7 శాతంతో ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2.1 శాతంతో ఏడో స్థానంలో నిలిచారు.
వీటితో పాట దేశంలో ఇప్పటికిప్పడు ఎన్నికలు నిర్వహిస్తే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏకు 324.. ఇండియా కూటమికి 208 స్థానాలు దక్కే అవకాశం ఉందని ఇండియా టుడే- సీ ఓటర్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న లోక్ సభ నియోజకవర్గాల్లో 54,788 మందిని ప్రశ్నించారు. రెగ్యలర్ ట్రాక్ ద్వారా మరో 1,52,038 మంది అభిప్రాయాలు సేకరించారు. ఇందలో బీజేపీ సొంతంగా 260, కాంగ్రెస్ సొంతంగా 97 సీట్ల గెలుచుకుంటుందని తెలిపింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు గెలచుకుంది. అయితే ఇప్పడు ఈ పార్టీకి సీట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఇండియా టుడే- సీ ఓటర్ తెలుపుతోంది.





