భారీ వర్షాలతో ఉత్తర తెలంగాణ అతలాకుతలం అవుతోంది. ఈ ప్రాంతంలో ఉన్న కరీంనగర్, కామరెడ్డి, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ముఖ్యంగా కామరెడ్డి జిల్లా రాజంపేట మండలం అర్గొండలో అత్యధికంగా 43.1 సెంటిమీటర్ల వర్షం కురిసింది. ఆ తరువాత కామరెడ్డి పట్టణంలో 28.9 సెంటిమీటర్లు, బిక్ నూర్ 27.9 , తాడ్వాయి 27.5 సెంటిమీటర్ల వర్షం కురిసింది. మొత్తంగా కామరెడ్డి జిల్లాలో ఎటు చూసినా వర్షమే కనిపిస్తోంది. అలాగే కరీంనగర్, మెదక్ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
కొట్టుకుపోయిన కారు.. ప్రాణాలు దక్కించుకున్న తండ్రీ కొడుకులు.. కామరెడ్డి జిల్లా దోమకొండకు చెందిన మేక చిన్న హరిశంకర్, ఆయన కుమారుడు కారులో వెళుతుండగా సంగమేశ్వర్ ఎడ్లకట్ట వాగు సమీపంలో వరదలో చిక్కుకున్నారు. ఆ తరువాత అందరూ చూస్తుండగానే.. వారి కారు వాగులో కొట్టుకుపోయింది. అయితే అదృష్టవశాత్తూ వారు మధ్యలో ఉన్న ఒక చెట్టును పట్టుకొని ఆగారు. దాదాపు 9 గంటల పాటు అలాగే ఉండి.. ఆ తరువాత వ్యవసాయ భూములసాయంతో బయటపడ్డారు.
కరీంనగర్ జిల్లాలోనూ వర్షం ఉధృతి కొనసాగుతోది. అయితే ఎగువన కురిసిన వర్షాలకు కరీంనగర్ లోని ఎల్ఎండీకి భారీగా వరదనీరు చేరుతోంది. ఇదిలా ఉండగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు.
Massive flooding caused by heavy rainfall in Kamareddy, Telangana, India 🇮🇳 pic.twitter.com/xtGs6630sj
— Disaster News (@Top_Disaster) August 27, 2025





