విఘ్నాలను తొలగించే వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ఆగస్టు 27 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సందర్భంగా వాడవాడలా కొలువుదీరేందుకు గణనాథుడు సిద్ధమయ్యాడు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజల తో పాటు నైవేద్యం కూడా చాలా ప్రాధాన్యతను కలిగి ఉంటుంది. వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు సమర్పించడం వల్ల ఆ స్వామి అనుగ్రహం సాధించవచ్చని అంటారు. అసలు వినాయకుడికి బాగా ఇష్టమైన ప్రసాదాలు ఏవో చూద్దాం..
ఉండ్రాళ్లు..

బియ్యం పిండితో చేసిన పిండికొవ్వు లాంటి వంటకం.లోపల తురిమిన కొబ్బరి, బెల్లం, నువ్వులు వుంటాయి.గణపతికి ఇది అత్యంత ప్రియమైన ప్రసాదంగా పరిగణిస్తారు.
లడ్డూ..

చాలా ప్రాంతాల్లో గణపతి విగ్రహంలో చేతిలో లడ్డూ ఉంటుంది. బూందీతో తయారు చేసిన లడ్డూతో ఐశ్వర్యం, సంతోషం, శుభఫలితాలకు సూచకం అని అంటారు.
కొబ్బరి (నారికేళం)..

గణపతికి నైవేద్యంగా తప్పనిసరిగా కొబ్బరి ఉంటుంది. ఇది పవిత్రతకు సూచకంగా సమర్పిస్తారు.
బెల్లం..

తీపి, శుభఫలితాల ప్రతీక. వినాయకుడి పూజలో బెల్లం, పాలు, కొబ్బరి కలిపి ప్రసాదం చేస్తారు.
పాలు / పాల పాయసం..

పాలు శుభ్రత, పవిత్రతకు ప్రతీక. పాయసం (కీర) కూడా వినాయకుడికి ఇష్టమైనది.
నువ్వులు (సెసేమ్)..

నువ్వుల వంటకాలు (నువ్వుల లడ్డూ, నువ్వుల ముద్ద) గణపతికి ఇష్టం. ఇది సమర్పిస్తే దీర్ఘాయుష్షు, ఆరోగ్యం కలుగుతాయని విశ్వాసం.
మోదకాలు:

బియ్యం పిండితో కొబ్బరి, బెల్లం లేదా ఇతర మిశ్రమాలను నింపి వాటిని ఆవిరిపై ఉడికిస్తారు.





