Saturday, December 6, 2025

పొలాల అమావాస్య అంటే ఏమిటీ? ఈరోజు ఏం చేస్తారు?

శ్రావణమాసంకు ఆధ్యాత్మికంగా ఎంత ప్రాధాన్యత ఉందో.. ఈ మాసం పూర్తయిన తరువాత వచ్చే అమావాస్యకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ అమావాస్యను పొలాల అమావాస్య అంటారు. పిల్లల సంక్షేమం కోసం తల్లలు ఈరోజున ప్రత్యేకమైన పూజలు చేస్తారు. అయితే ఈ వ్రతం తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం లేకపోయినా.. గోదావరి తీర ప్రాంతాల్లో ఎక్కువగా నిర్వహిస్తారు. అయితే ఇదే రోజు మరో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రైతులకు ఎంతో సాయంగా ఉండే గోవులను ప్రత్యేకంగా పూజిస్తారు. దీనినే అన్నదాతల పండుగ.. బసవన్నల పండుగ అనికూడా అంటారు. మరి పొలాల అమావాస్య రోజు ఇంకా ఏం చేస్తారు?

శ్రావణమాసం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండి ఉంటుంది. ఈ నెలలో వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం నిర్వహిస్తారు. అలాగే శ్రావణమాసం పూర్తయిన తరువాత వచ్చే అమావాస్య రోజున కూడా పొలాల అమావాస్య వ్రతంను నిర్వహిస్తారు. అయితే ఈ వ్రతం నిర్వహించడానికి ఒక కారణం ఉంది. పూర్వ కాలంలో ఒక బ్రహ్మణ కుటుంబానికి ఏడుగురు కుమారులు ఉండేవారు. వీరికి వివాహం అయిన తరువాత వేర్వేరుగా కాపురం నిర్వహిస్తుంటారు. వీరు ప్రతీ శ్రావణమాసంలో వచ్చే అమావాస్య రోజున పొలాంబ అమ్మవారిని పూజిస్తూ ఉండేవారు. అయితే ఒక సంవత్సరంలో వీరు పొలాంబ అమావాస్య నిర్వహించడానికి ఏర్పాటు చేసుకున్న క్రమంలో చివరి కొడుకు మరణిస్తాడు.

దీంతో వ్రతం చేయడానికి అడ్డంకి ఏర్పడుతుంది. మరో ఏడాది మరో కుమారుడి కొడుకు చనిపోతాడు. ఇలా ప్రతీ ఏడాది కుటుంబంలో ఈ సమయానికి ఒకరు చనిపోతుంటారు. అయితే ఈ మరణాలకు ఏడో కొడలే కారణం అని నిందిస్తూ ఉంటారు. ఎనిమిదో ఏడాది మరొకరు చనిపోయినా.. నిందల నుంచి తప్పించుకోవడానికి ఏడోకోడలు వ్రతంలో ఎవరికీ చెప్పకుండా పాల్గొంటుంది. ఆ రాత్రి పోలేరమ్మ గుడి వద్దకు వెళ్లి ఏడుస్తూ తన కుటుంబంలో జరిగిన విషయాన్ని దేవతకు చెబుతుంది. దీంతో అమ్మవారు కరుణించి కొన్ని అక్షింతలు ఇస్తుంది. వీటిని చల్లగానే మరణించిన వారు లేచి వచ్చినట్లు కథలో ఉంది. దీంతో అప్పటి నుంచి పిల్లల శ్రేయస్సు కోసం ఈ వ్రతం చేయాలని నిర్ణయించుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి.

అయితే ఉత్తర తెలంగాణలో పొలాల అమవాస్యను ప్రత్యేకంగా నిర్వహించుకుంటారు. ఈరోజు తమకు ఎంతో సాయంగా ఉండే ఎద్దులను శుభ్రం చేస్తారు. వాటిని అందంగా అలంకరిస్తారు. వాటి కొమ్ములకు రంగులు వేస్తారు. ఆ తరువాత వీటిని ఊరంతా తిప్పుతారు. ఇలా బసవన్నలు గ్రామంలో తిరుగూతూ ఉండడంతో ఊరంతా సందడి చేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. గోదావరి తీర ప్రాంతాల్లో పోచమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి తమ కుటుంబం సంక్షేమంగా ఉండాలని కోరుకుంటారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News