Artificial Intelligence(AI) అందుబాటలోకి వచ్చిన తరువాత అందరూ దీనినే ఫాలో అవుతున్నారు. కావాల్సిన సమాచారం పొందడానికి గూగుల్ కు బదులు దీనినేనమ్ముకుంటున్నారు. అయితే గూగుల్ లో సెర్చ్ చేసే సమయంలో ఒకహెచ్చరిక ఇస్తుంది. పూర్తిగా ఈ సమాచారంపై ఆధారపడకండి.. అని.. కానీ చాలా మంది అదేమీ పట్టించుకోవడం లేదు. అలా పట్టించుకోకుండాఓవ్యక్తి ఆరోగ్యం కోసం చాట్ జీపీటీని నమ్ముకోవడంతో.. ఇప్పుడు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. అసలేం జరిగిందంటే?
అమెరికాలోని 60 ఏళ్ల ఓ వ్యక్తి నిత్యం ChatGPTతో సమాచారం పొందుతూ ఉంటాడు. అలాగే తన ఆరోగ్యం గురించి కూడా విషయాలు తెలుసుకోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగా ఆహారంలో ఉప్పుకు బదులుఏదీ వాడాలని చాట్ జీపీటీలో ప్రశ్న అడిగాడు. దీంతో ఇందులో బ్రోమైడ్ ను వాడవచ్చని సమాధానం వచ్చింది. దీంతో ఆ వ్యక్తిఉప్పుకు బదులు బ్రోమైడ్ వాడడం ప్రారంభించాడు. అలా కొన్నాళ్ల తరువాత అతని ఆరోగ్యంలో సమస్యలు వచ్చాయి. దీంతో తీవ్రమైన దాహం, ఇతర చర్మ సమస్యలు రావడంతో ఆసుపత్రికి వెళ్లాడు.
అతడు మూడు నెలల పాటు ఉప్పు వాడకుండా బ్రోమైడ్ ను వాడాడు. దీంతో అతని శరీరంలో లవణ శాతం తగ్గిపోయింది. అయితే చికిత్సలో భాగంగా వైద్యుల అతడికి నీరు ఇచ్చినా తీసుకోవడం లేదు. దీంతో ఎలక్ట్రోలైట్స్ తో చికిత్స అందిస్తున్నారు. అంతేకాకుండా అతని మానసిక పరిస్థితి కూడా సరిగా లేదు. ఒకసారి ఆసుపత్రి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే బ్రోమైడ్ అనేది ఉప్పులాగే ఉంటుంది. కానీ దీనిని ఔషధాలలో ఉపయోగిస్తారు. దీనిని నేరుగా తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.





