Friday, December 5, 2025

గ్రెగోరియన్, జూలియన్ క్యాలెండర్ అంటే ఏమిటి? మనం ఇప్పుడు ఏదీ వాడుతున్నాం?

ఉదయం లేవగానే ముందుగా సమయం చూస్తాం.. ఆ తరువాత క్యాలెండర్ ను చూసి తేదీ గురించి తెలుసుకుంటాం.. క్యాలెండర్ లో ఉన్న తేదీలకు అనుగుణంగా కొన్ని పనులకు ప్రణాళిక వేసుకుంటాం.. ఈ క్యాలెండర్ ప్రకారమే ప్రపంచం అన్ని పనులను సక్రమంగా నిర్వహిస్తుంది. దీనిని ప్రోప్ గ్రెగొరియన్ 1582లో కనిపెట్టారు. అయితే అంతకుముందు ఉన్న క్యాలెండర్ ను జూలియన్ క్యాలెండర్ ను ఫాలో అయ్యేవారు. మరి ఆ క్యాలెండర్ కు, ఇప్పటి క్యాలెండర్ కు మధ్య ఉన్న తేడా ఏంటి? అసలెందుకు క్యాలెండర్ ను మార్చాల్సి వచ్చింది?

ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు గ్రెగోరియన్ క్యాలెండర్ (Gregorian Calendar) వాడుతున్నాయి. ఇది మనం ప్రతిరోజూ చూసే క్యాలెండర్. ఈ క్యాలెండ్ లో జనవరి – డిసెంబర్ వరకు 12 నెలలు ఉంటాయి. ప్రతి నెలలో 28–31 రోజులు ఉంటాయి. సూర్యుని చుట్టూ భూమి తిరిగే సమయానికి సరిపోయేలా సంవత్సరం పొడవును ఖచ్చితంగా నిర్ణయించి దీనిని తయారు చేశారు.

ఒక సంవత్సరం పొడవు = సగటుగా 365.2425 రోజులు

12 నెలలు= జనవరి (31), ఫిబ్రవరి (28/29), మార్చి (31), ఏప్రిల్ (30), మే (31),జూన్ (30), జూలై (31), ఆగస్టు (31),సెప్టెంబర్ (30),అక్టోబర్ (31),నవంబర్ (30), డిసెంబర్ (31)

లీప్ ఇయర్ నియమం= గ్రెగోరియన్ క్యాలెండర్‌లో లీప్ ఇయర్ అంటే:

    సంవత్సరం 4తో భాగిస్తే → లీప్ ఇయర్

    కానీ 100తో భాగిస్తే → లీప్ ఇయర్ కాదు

    అయితే 400తో భాగిస్తే → మళ్లీ లీప్ ఇయర్ అవుతుంది

ఉదా: 2020 → లీప్ ఇయర్

1900 → లీప్ ఇయర్ X (100తో భాగం, కానీ 400తో కాదు)

ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, వ్యాపారాలు, అంతర్జాతీయ సమయ నియంత్రణ కోసం ఇదే క్యాలెండర్ వాడుతున్నారు. అయితే కొన్ని దేశాల్లో ధార్మిక / సాంప్రదాయ క్యాలెండర్లు (హిందూ, ఇస్లామిక్, జ్యూయిష్, చైనా) పండుగల కోసం వాడినా, అధికారిక రికార్డులు మాత్రం గ్రెగోరియన్ పద్ధతిలోనే ఉంటాయి.

ఇక ఈ క్యాలెండర్ రాకముందు జూలియన్ క్యాలెండర్ ఉండేది. ఇది ఎలా ఉండేదంటే?

జూలియన్ క్యాలెండర్ (Julian Calendar) అనేది మనం ఇప్పుడు వాడుతున్న గ్రెగోరియన్ క్యాలెండర్‌కు ముందు యూరప్‌లో వాడారు. దీనిని జూలియస్ సీజర్ క్రీస్తు పూర్వం 45 సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. అప్పటివరకు రోమన్ క్యాలెండర్ ఉండేది. ఇది చాలా గందరగోళంగా ఉండేది. సీజర్ ఖగోళ శాస్త్రజ్ఞుడు సోసిజెన్స్ (Sosigenes of Alexandria) సలహాతో ఈ కొత్త పద్ధతి ప్రవేశపెట్టాడు.

ఈ క్యాలెండర్ ప్రకారం…

ప్రతి 4 ఏళ్లకోసారి ఒక అదనపు రోజు (ఫిబ్రవరి 29) పెట్టేవారు.

సంవత్సరం పొడవు → 365.25 రోజులు అని నిర్ణయించారు.

12 నెలలు → జనవరి నుంచి డిసెంబర్ వరకు.

లీప్ ఇయర్:

అంటే సంవత్సరం పొడవు సగటు 365 రోజులు + ¼ రోజు.

ఈ క్యాలెండర్ తో ఉన్న సమస్యలు ఏంటంటే?

జూలియన్ క్యాలెండర్ ప్రకారం.. సౌర సంవత్సరం పొడవు 365.2422 రోజులు మాత్రమే. అంటే జూలియన్ పద్ధతిలో 365.25 రోజులు గణన చేసేవారు కాబట్టి ప్రతి సంవత్సరం 11 నిమిషాలు 14 సెకన్లు అదనంగా వచ్చేంది. ఇది చిన్న తేడా అయినా.. పెద్ద తప్పు జరిగేంది. ఈ తప్పు 128 ఏళ్లకు ప్రభావం చూపేది.
1500ల నాటికి ఈ తప్పు దాదాపు 10 రోజులు పెరిగింది. ఫలితంగా వసంత సమానదినం (Spring Equinox) మార్చి 21 నుండి ముందుకు జారిపోయింది. దీంతో గ్రెగోరియన్ క్యాలెండర్ అందుబాటులోకి వచ్చింది.

అయితే యూరప్, రష్యా, మధ్యప్రాచ్యం, మరియు కొంతమంది క్రైస్తవ చర్చిలు జూలియన్ క్యాలెండర్ నే ఇంకా వాడుతాయి (ఉదా: రష్యన్ ఆర్థడాక్స్ చర్చి). రష్యా 1918 వరకు ఈ క్యాలెండర్ ను ఫాలో అయి ఆ తరువాత గ్రెగోరియన్ క్యాలెండర్‌కి మారింది. కానీ చర్చి పండుగలు ఇప్పటికీ జూలియన్ పద్ధతిలో జరుపుతారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News