Saturday, December 6, 2025

అభిమానం అంటే ఇదీ..ఖాన్ సార్ కు 15వేల రాఖీలు కట్టారు..

అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేసేది రాఖీ పండుగ. ఈ ఏడాది ఆగస్టు 9న దేశవ్యాప్తంగా రాఖీ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. సోదరులకు తమ చెల్లెళ్లు రాఖీలు కట్టి తమ అనుబంధాన్ని చాటుకున్నారు. అయితే అన్నా చెల్లెళ్లు మాత్రమే కాకుండా కొన్ని సంస్థలు, కార్యాలయాల్లో కొందరు వ్యక్తులకు చెల్లెల్లుగా భావించిన వారు రాఖీలు కట్టే తమ ప్రేమను తెలియజేశారు. అయితే రాఖీలు మహా అయితే రెండు లేదా పది వరకు కడుతూ ఉంటారు. కానీ ఒక వ్యక్తికి ఏకంగా 15000 రాఖీలు కట్టారు. విద్యార్థులకు ఎడ్యుకేటర్ గా ఉన్న ఆయనపై ఉన్న ప్రేమతో విద్యార్థులు, ఉద్యోగులు అందరూ కలిసి అతనికి రాఖీ కట్టారు.

బీహార్ రాష్ట్రానికి చెందిన పైజల్ ఖాన్ అనే వ్యక్తి ఎడ్యుకేటర్ గా సుపరిచితుడు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఆయన ఎడ్యుకేటర్ గా ఎన్నో సూచనలు ఇస్తూ ఉంటాడు. సామాజిక మాధ్యమాల్లో ఆయన వీడియోలు వైరల్ కూడా అయ్యాయి. బీహార్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించారు. ఈయన ప్రోత్సాహంతో ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందారు. ఈ సందర్భంగా ఆయనపై చాలామంది అభిమానం పెంచుకున్నారు. అయితే రాఖీ పండుగ సందర్భంగా తనపై ఉన్న ప్రేమను తెలియజేయడానికి కొందరు విద్యార్థులు నేరుగా ఆయనను కలుసుకొని రాఖీలు కట్టారు. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉండడం విశేషం. ఇలా మొత్తంగా 15000 మంది అతని చేతికి రాఖీ కట్టి తమ అనుబంధాన్ని తెలియజేశారు. ఇన్ని రాఖీలు కట్టిన అతని చేతికి రక్త ప్రసరణ కూడా ఆగిపోయిందంటూ చమత్కారంతో ఫైజల్ ఖాన్ సార్ మీడియాకు తెలిపాడు. ఇలా రాఖీలు కట్టుకున్న పైసల్ ఖాన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బీహార్ లోని పాట్నాలో శ్రీకృష్ణా మెమోరియల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాఖీ కట్టేందుకు విద్యార్థులు పోటీ పడ్డారు. అంతేకాకుండా ఖాన్ సార్ గా పేరొందిన ఆయన ముస్లిం కావడంతో మతసామరస్యానికి ప్రతీక ఈ రాఖీ పండుగ అని కొందరు కొనియాడుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News