రాఖీ కట్టేందుకు అంతా సిద్ధమయ్యారు. ప్రతీ శ్రావణ పౌర్ణమి రోజు వచ్చే ఈ రాఖీ పండుగను సోదరీ, సోదరులు ఘనంగా జరుపుపోవాలని చూస్తారు. దీంతో సోదరీమణులు ఎక్కడున్నా.. తమ సోదరుల వద్దకు రావాలని అనుకుంటారు. అయితే రాఖీ కట్టే సమయంలో కొన్నింటిని పాటించాలని పండితులు అంటున్నారు. ఈ పండుగ సంతోషంగా ఉండాలని రాఖీని ఈ విధంగా కట్టాలని చెబుతున్నారు.
శ్రావణమాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 9న రాఖీ పండుగ జరుపుకోనున్నారు. శ్రావణ పౌర్ణమి ఆగస్టు 8వ తేదీన మధ్యాహ్నం 2.12 గంటలకు ప్రారంభమై ఆగస్టు 9వ తేదీన మధ్యాహ్నం 1.12 గంటలకు ముగుస్తుంది. అయితే శనివారం రాఖీ పండుగ నిర్వహించుకోనున్నారు. దీంతో 9వ తేదీ ఉదయం 6.18 గంటల నుంచి మధ్యాహ్నం 1.24 గంటల లోపు రాఖీ కట్టుకోవాలని పండితులుచెబుతున్నారు. అయితే ఈ సమయంలో రాఖీ కట్టుకోవడం వీలు కానప్పుడు ప్రదోష కాలం.. అంటే సాయంత్రం 7 గంటల తరువాత రాఖీ కట్టుకోవచ్చని కొందరు అంటున్నారు. అయితే ఈ విషయాన్ని సమీప జ్యోతిష్యులను అడిగిన తరువాత కట్టుకోవాలి.
రాఖీ కట్టే సమయంలో కేవలం రాఖీ మాత్రమే కాకుండా ఒక పాత్రలో స్వీట్లు, రాగి, తమలాపాకు, నాణెం ఉండేలా చూసుకోవాలి. లేకుంటే కట్టిన రాఖీకి విలువ ఉండదు. రాఖీ కట్టే సమయంలో సోదరుడు తూర్పు వైపు ముఖం ఉంచి కూర్చోవాలి. లేదా ఉత్తరం వైపు కూర్చున్నా.. పర్వాలేదు. ఈ రెండు దిశలు కాకుండా వేరే దిశలో కూర్చుంటే మంచిది కాదని పండితులు అంటున్నారు. అలాగే దేవుడ గది దగ్గరిగా కూర్చొని రాఖీ కట్టుకోవాలని అంటున్నారు. రాఖీలు ఎరుపు, పసుపు, నీలం, ఆరేంజ్ కలర్లో ఉన్నా పర్వాలేదు. కానీ నలుపు రాఖీలను ఎట్టి పరిస్థితుల్లో కట్టకూడదని అంటున్నారు.





