Saturday, December 6, 2025

ఫోన్ కు వచ్చే మెసేజ్ లో చివరి ఉన్న G, P, S లెటర్ కు అర్థం ఏంటీ?

ఫోన్ కు ఏదైనా కొత్త మెసేజ్ వస్తే ఇప్పుడు భయపడిపోతున్నారు. ఎందుకంటే అది స్కాం మెసేజ్ నో.. లేక మరేంటిదోనన్న ఆందోళన ఉంటుంది. అయితే మొబైల్ వాడేవారు కొన్ని విషయాలపై కచ్చితంగా అవగాహన ఉండాలి. ఎందుకంటే నేటి కాలంలో కొందరు సైబర్ నేరగాళ్లు నార్మల్ మెసేజ్ లాగే పంపిస్తూ వినియోగదారుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. అయితే ఇదే సమయంలో కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన మెసేజ్ లు.. బ్యాంకుకు సంబంధించిన మెసేజ్ లు ఉంటాయి. మరి ఇవి నిజమా? కాదా? అనేది తెలియదు. అయితే ఇలాంటి కన్ఫ్యూజ్ ఉండకుండా టెలికాం సంస్థలు అధికారిక మెసేజ్ లకు కొన్ని గుర్తులు ఇచ్చారు. వాటి ఆధారంగా అవి ఏ రకమైన మెసేజ్ లో గుర్తించవచ్చు. అవి ఏంటంటే?

మొబైల్ కు ఏదైనా మెసేజ్ వచ్చి ఆ మెసేజ్ చివరన ‘G’ అనే లెటర్ ఉందనుకోండి.. అప్పుడు అది గవర్నమెంట్ కు సంబంధించిన మెసేజ్. ఉదాహరణకు ఏవైనా ప్రభుత్వ పథకాలు లేదా ఇతర విషయాలు అందించేందుకు ఇలా చివరన జీ అనే అక్షరాన్ని చేర్చుతారు. అప్పుడు మెసేజ్ వచ్చిన వెంటనే చివరకు ఈ లెటర్ ఉంటే నిరభ్యరంతంగా ఓపెన్ చేసుకోవచ్చు.

ఇలాగే మొబైల్ కు వచ్చిన మెసేజ్ చివరన ‘S’అనే అక్షరం ఉంటే.. అది బ్యాంకు కు సంబంధించిన మెసేజ్ అని అనుకోవాలి. ఎందుకంటే చాలా మందికి బ్యాంకుతో మొబైల్ లింక్ అయి ఉంటాయి. బ్యాంకుకు సంబంధించిన మెసేజ్ అని తెలుసుకోవాలి. బ్యాంకుకు సంబధించిన బ్యాలెన్స్ లేదా.. డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన సమాచారాన్ని ఇవి అందిస్తూ ఉంటాయి. దీనిని సర్వీస్ అని అంటారు. అందుకే ఈ మెసేజ్ లు S తో ఉంటాయి.

మరికొన్ని మెసేజ్ లు ఇలా చివరన ‘P’ అనే అక్షరంతో ఉంటాయి. ఇలాంటి మెసేజ్ ఉంటే ఇవి ప్రమోషన్ కు సంబంధించినవి అనుకోవాలి. ఎయిర్ టెల్, జియోతో పాటు కొన్ని కంపెనీలు తమ ప్రోడక్ట్ ను తెలియజేయడానికి మెసేజ్ లు పంపిస్తూ ఉంటాయి.

అయితే మెసేజ్ చివరన ఎలాంటి నెంబర్ లేకపోతే ఎలా? అయితే ఇలాంటి మెసేజ్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి స్కాం అయి ఉండొచ్చు. వినియోగదారులను స్కామర్ల నుంచి కాపాడేందుకు టెలికం సంస్థలు అధికారికంగా పై లెటర్లను ఇచ్చారు. స్కామర్లు మాత్రం ఇలాంటి లెటర్లు పెట్టరు. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News