Saturday, December 6, 2025

ఢిల్లీ ఓబీసీ ధర్నాలో పెద్దపల్లి కాంగ్రెస్ శ్రేణులు

  • 42 శాతం రిజర్వేషన్ సాధించేవరకు ఉద్యమిస్తాం
  • జిల్లా ఓబీసీ కాంగ్రెస్ నాయకుడు తాడూరి శ్రీమన్నారాయణ వెల్లడి

పెద్దపల్లి:రాష్ట్ర ప్రభుత్వం హామీలో భాగంగా 42శాతం బీసీల రిజర్వేషన్ల సాధనకై న్యూఢిల్లీలో బుధవారం జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నా కార్యక్రమంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఓ బి సి శ్రేణులు పాల్గొన్నారు. జంతర్ మంతర్ వద్ద జరిగిన ఈ ధర్నా కార్యక్రమానికి పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబిసి నాయకుడు తాడూరి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో సుమారు వందమంది ఓబీసీ ముఖ్య నాయకులు కార్యకర్తలు దీక్షా కార్యక్రమంలో భాగస్వామ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. బిజెపి, టీఆర్ఎస్ పార్టీలు ఓబీసీలపై చిత్తశుద్ధి లేని రాజకీయాలు నడుపుతున్నారని ఈ పార్టీలు ఓబీసీలకు మద్దతుగా నిలవకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని తాడూరు శ్రీమన్నారాయణ తెలిపారు.

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఓబీసీ ధర్నా ఢిల్లీలో విజయవంతం అవడం 42 శాతం రిజర్వేషన్లు సాధించే మార్గం సుగనమైందని అన్నారు యూపీఏ భాగస్వామి పార్టీలైన ఆర్జెడి ఎన్సిపి డిఎంకె పార్టీలతోపాటు బాగా సౌమ్య పక్షాలకు చెందిన సుమారు 200 ఎంపీలు ధర్నా కార్యక్రమంలో పాల్గొని 42 శాతం రిజర్వేషన్ల సాధన దీక్షకు మద్దతు ఇవ్వడం దేశ చరిత్రలో లిఖించ తగిందని తాడూరి శ్రీమన్నారాయణ పేర్కొన్నారు. పెద్దపెల్లి జిల్లాకు చెందిన పెద్దపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ రాష్ట్ర కాంగ్రెస్ కోఆర్డినేటర్ కొండి సతీష్ కందుల సదయ్య ఏం కొమురయ్య చందు సమ్మయ్య లతోపాటు పలువురు ఓబీసీలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News