రైతులు తమ పంటలను కాపాడుకునేందుకు రసాయనాలు వాడుతూ ఉంటారు. దీంతో ఒక్కోసారి ఇది ప్రమాదకరంగా మారొచ్చు. అయితే ఈ సమస్యను పరిష్కరించేందుకు పర్యావరణ హితమైన నానో యూరియాను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతీ ఏటా సాగులో పెరుగుతున్న ఖర్చులు.. ప్రకృతిలో ఏర్పడే ప్రతికూల పరిస్థితులు.. చీడ పీడలు, తెగుళ్ళ కారణంగా పంట దిగుబడి తగ్గిపోతుంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తరుణంలో రైతులకు ఉపయోగకరంగా ఉండేందుకు నానో యూరియాను తీసుకొచ్చారు. ఈ యూరియా వినియోగంతో నేల, గాలి, నీటి కాలుష్యంతోపాటు పంటల సాగులో చీడ పీడల, తెగుళ్ళ నుంచి రక్షిచుకోవచ్చు. ఈ యూరియా నిల్వ, రవాణా సులభతరం. దీనిని ఉపయోగించడం ద్వారా రైతులు పం టలు సంకట హరణ బీమా పాలసీ పరిధిలోకి వస్తా యి. చెరుకు, పప్పు దినుసులు, కూరగాయలాంటి వివిధ రకాల పంటల్లో వాడటం వలన కలిగే లాభాలు, ప్ర యోజనాలు, దిగుబడి, ఖర్చుల ఆదా కాలుష్య నివా రణపై రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రమోజనాలు:
నానోయూరియా ప్లస్ అనేది అన్ని పంటలకు నత్రజనిని సమర్ధవంతంగా అందిస్తుంది. దీని పిచికారి వంటలలో నత్రజని లోపాలను సరి చేస్తుంది. దీని పిచికారి వలన ఎక్కవ పత్ర హరితం, మెరుగైన కిరణజన్య సంయోగ క్రియ సామర్థ్యంతో పంట దిగుబడి పెరుగుతుంది. అనుకూలమైన పరిస్థితుల్లో దీన్ని పోషక వినియోగ సామర్థ్యం 30 శాతం కంటే ఎక్కవగా ఉంటుంది. సాంప్రదాయ యూరియా కంటే తక్కవ ధర, రైతులకు తక్కవ ఖర్చు.
పిచికారి విధానం:
2-4 మిల్లీ లీటర్ల నానోయూరియా ప్లస్ని లీటర్ నీటిలో కలిపి ఆకులపై, శాఖీయోత్పత్తి దశలో, 20-25 రోజుల తర్వాత రెండో సారి పిచికారి చేయాలి.
దీర్ఘ కాల, అధిక నత్రజని అవసరమయ్యే పంటలకు అదనపు నానోయూరియా పిచికారి చేసుకోవచ్చు.వరి, మొక్కజొన్న, జొన్న పంటలో పిలక దశలో మొదట, రెండోసారి పూతకు ముందు దశలో, మూడోసారి నత్రజని అవసరాన్ని బట్టి పిచికారి చేసుకోవాలి.పత్తి పంటలకు మొదటి దశ శాఖీయోత్పత్తి దశలో, రెండోసారి పూతకు ముందు, కాయ ఏర్పడ్డ దశలో మూడోసారి పిచికారి చేయాలి.పండ్లు, పూల పంటలకు నత్రజని అవసరాన్ని బట్టి పూతకంటే ముందు కాయ ఏర్పాటు దశ, కాయ ఎదిగే దశల్లో పిచికారిలు చేసుకోవాలి.
నానో యూరియా ప్లస్ ఒక ఎకరాకు 250-500 మిల్లీలీటర్లు పిచికారి చేసుకోవాలి. స్ప్రేయర్ రకాన్ని పంట దశను బట్టి అవసరమైన నీటి పరిమాణం మారుతుంది. నానో యూరియా ఎకరం పంట విస్తీరానికి 4-6 ట్యాంక్ స్ప్రే ద్రావణం సరిపోతుంది. నానో యూరియా ప్లస్ పిచికారి మిశ్రమాన్ని తయారు చేయటానికి శుభ్రమైన నీటి ఉపయోగించాలి. ఉదయం లేదా సాయంత్రం వేళ్ళల్లో పిచికారి చేయాలి.పిచికారి చేసిన 8 గంటల లోపు వర్షం పడితే మళ్ళీ పిచికారి చేసుకోవాలి. 500 ఎంఎల్, ఇఫ్కో సహకార సంఘాలు, పీఎంకేఎస్, విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి.
ముందు జాగ్రత్తలు:
తయారీ తేదీ నుంచి 24 నెలల్లో ఉపయోగించాలి.
ముఖానికి మాస్క్ దర్శించాలి. చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి.
పిల్లలు, జంతువులకు దూరంగా ఉంచాలి.
రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయాధికారులు
అయితే పూర్తి వివరాల కోసం సమీపంలోని వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలి.





