ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన డబ్బుల కోసం ఎదురు చూస్తున్న రైతులకు శుభవార్త. 20వ విడత నిదులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 2న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా మొత్తం రూ.20,500 కోట్లను విడుదల చేశారు. ఈ నిధుల ద్వారా 9.7 కోట్ల రైతులు లబ్ధి పొందారు. ప్రతీ రైతుకు రూ.2000 అందుకున్నారు. ప్రతీ ఏడాది రూ.6000 చెల్లించే భాగంగా 20వ విడుద కింది ప్రస్తుతం రూ.2,000 అందుకున్నారు. అయితే కొందరికి ఇప్పటి వరకు బ్యాంకులో డబ్బులు జమ అయినట్లు మెసేజ్ రాలేదు. అయితే ఇలా చేయాలని వ్యవసాయ నిపుణులు తెలుపుతున్నారు.
రైతులు తమ భూమికి సంబంధించి ఈ కే వైసీ పూర్తి చేయకపోతే ఈ సమస్య వస్తుందని అంటున్నారు. ఈ కేవైసీ కోసం ఇలా చేయాలి. ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఆ తరువాత Beneficiary Status సెక్షన్‌లో Aadhaar, Ration ID, లేదా Account Number ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. కావాల్సిన వివరాలు అందించి సబ్మిట్ చేయాలి. ఇప్పుడు బ్యాంకు ఖాతాలో లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ఎంట్రీ చేస్తే ఈ కైవేసీ పూర్తి అవుతుంది.
మొబైల్ లోనూ ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. PM-Kisan Portal లేదా ఆండ్రాయిడ్ యాప్ ద్వారా ఈ సౌకర్యం ఉంటుంది.
అయితే అంతుకు ముందు Aadhaarతో బ్యాంకు ఖాతా లింక్ అయి ఉందా? లేదా? కన్ఫామ్ చేసుకోవాలి. IFSC తప్పుగా ఉన్నా.. డబ్బులు జమ కావు. అలాగే Land record లో ఏదైనా తేడా ఉన్నట్లయితే సమీప తహసీల్దార్ కార్యాలయాలో సంప్రదించాలి.





