శ్రావణమాసంలో ముఖ్యమైన పండుగలు వస్తుంటాయి. వీటిలో నాగుల పంచమి ఒకటి. ఈరోజు ఊరు, వాడా నాగదేవతను కొలుస్తారు. పాము పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. 2025 ఏడాదిలో జూలై 29న నాగుల పంచమిని జరుపుకోనున్నారు. నాగదేవతకు ఆలయాలు తక్కువగానే ఉంటాయి. ప్రముఖ ఆలయాల్లో నాగదేవతను దర్శించుకోవచ్చు. కానీ నాగుల పంచమి రోజు మాత్రమే తెరిచే ఓ ఆలయం ఉంది. అది ఎక్కడుందంటే?
శ్రావణమాసంతో పండుగల సీజన్ ప్రారంభం అయిందని అంటారు. ఇప్పటి నుంచి ఉగాది వరకు ఆలయాల్లో నిత్య పూజలు జరుగుతూనే ఉంటాయి. కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే ఆలయాలను మూసివేస్తారు. అయితే ఓ ఆలయం ఏడాది పాటు మూసివేసి ఉంటుంది. కేవలం శ్రావణమాసంలో నాగపంచమి రోజు మాత్రమే తెరిచి ఉంటుంది.
శ్రావణమాసంలో శుభముహూర్తాలు, పండుగలు ఇవే.. – insightearth.in – Telugu News Portal
ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర్ ఆలయం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఆలయం మూడు అంతస్థుల్లో ఉంటుంది. మూడు అంతస్థుల్లోనూ శివలింగాలు ఉంటాయి. మొదటి ఆలయంలో శివుడు మహా కాళేశ్వర్ గా పిలవబడుతాడు. రెండవ ఆలయంలో ఓంకారేశ్వర్ గా పిలవబడుతాడు. ఈ రెండు ఆలయాలు ఏడాది పొడవునా దర్శించుకోవచ్చు. కానీ మూడో అంతస్థులో ఉన్న నాగచంద్రేశ్వర ఆలయాన్ని ఏడాదికి ఒక్కసారి మాత్రమే దర్శించుకోవాలి.

ప్రతీ శ్రావణ మాసంలో ఐదో రోజు నాగుల పంచమిని జరుపుకుంటారు. ఈరోజు మాత్రమే ఈ ఆలయాన్ని తెరిచి ప్రత్యేక పూజలు చేస్తారు. నాగుల పంచమి ప్రారంభమైన అర్ధరాత్రి తలుపులు తెరిచి 24 గంటల పాటు మాత్రమే ఉంచుతారు. ఆ తరువాత మూసివేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో నాగులపంచమి రోజున పుట్టలో పాలు పోస్తుంటారు. శివాలయాలను దర్శించుకుంటారు. కానీ ఈ రోజున ఏడాదికి ఒక్కసారి మాత్రమే తెరిచి ఉండే నాగచంద్రేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల ఎన్నో శుభపలితాలు ఉంటాయని పండితులు చెబుతూ ఉంటారు.





