Saturday, December 6, 2025

ఆగస్టు నెలలో ఈ రాశుల వారికి అన్నీ విజయాలే..

జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు మారినప్పుడల్లా రాశులపై ప్రభావం పడుతుంది. ఈ క్రమంలో రాశుల స్థితిగతులు మారుతూ ఉంటాయి. రోజురోజుకు ఈ రాశుల స్థితి మారడంతో.. ఈ రాశులు కలిగిన మనుషుల జీవితాల్లో అనేక మార్పులు వస్తుంటాయి. ప్రస్తుతం శ్రావణమాసం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కొత్త పనులు ప్రారంభించేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. అలాగే కొత్త నిర్మాణాలు కూడా చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో వారి జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. అయితే ఆగస్టు 1 నుంచి 31 వరకు రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేషం:
మీ రాశి వారికి ఉద్యోగాల్లో పోటీ ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారాలు కార్యకలాపాలను విస్తరిస్తారు. కొందరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. విద్యారంగంలో ఉన్నవారికి క్లిష్టమైన పరిస్థితిలో ఎదురవుతాయి. అయితే కాస్త కష్టపడడం వల్ల అనుకున్న ఫలితాలు పొందుతారు.

వృషభం:
ఈ రాశి వారు ఈనెల మొత్తం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వెడ్డింగ్ పనులను పూర్తి చేసుకోవాలి. కొన్ని పనులకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇష్ట దైవాన్ని కోరుకోవడం వల్ల ఆటంకాలు లేకుండా ఉండవచ్చు. మానసికంగా సంతోషంగా ఉంటారు.

మిథునం:
ఉద్యోగులు తమ వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు ఈ నెలలో లాభాలు ఎక్కువగా ఉండలున్నాయి. గతంలో కంటే ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండడం అవసరం..

కర్కాటకం:
కెరీర్ పై ఈ నెలలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యక్తిగత సంబంధాల్లో వివాదాలు ఏర్పడతాయి. ఆదాయం కోసం తీవ్రంగా శ్రమిస్తారు. ఉన్నత విద్య కోసం సమయం కేటాయిస్తారు. జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు కొత్త వ్యక్తులను సంప్రదిస్తారు.

సింహం:
ఆదాయం బాగున్నా.. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారానికి సంబంధించిన కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. ఉద్యోగులు కొన్ని సవాలను ఎదుర్కొంటారు. కొందరు మీ స్వాతంత్రానికి భంగం కలిగించే అవకాశం ఉంది. విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తారు.

కన్య:
లక్ష్యాలను చేరుకోవడానికి కష్టపడతారు. కొత్త ఉద్యోగంలో చేరుతారు. కెరీర్ పైకి ఇలాగ నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు సానుకూల ఫలితాలు ఉండలు ఉన్నాయి. సంబంధాలు మెరుగుపడతాయి. శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు.

తుల:
కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం మీదే ఉంటుంది. బంధువుల మధ్య భావోద్వేగాలు ఏర్పడతాయి. వివాదాలను పరిష్కరించుకుంటారు.

వృశ్చికం:
శారీరక ఆరోగ్యం పై దృష్టి పెట్టాలి. వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. యువత ఉత్సాహంతో కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. కొన్ని నిర్ణయాలు తీసుకునే సమయంలో పెద్దలను సంప్రదిస్తారు. స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు.

ధనస్సు:
ఆదాయం పెంచుకోవడానికి విహాత్మక ప్రణాళికలు వేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారాలను అభివృద్ధి చేస్తారు. ఇతరులకు డబ్బులు సహాయం చేస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు.

మకరం:
ఆర్థికపరంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగులు నిపుణులతో కలిసి ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. విద్యార్థుల కెరీర్ పైకి ఎలక నిర్ణయం తీసుకుంటారు. వ్యక్తిగత సంబంధాలు మెరుగుపడతాయి. ఆదాయాన్ని పెంచుకోవడంలో దృష్టి పెడతారు.

కుంభం:
కొన్ని ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పూర్వికులు ఆస్తి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. కెరీర్ పై ఫోకస్ పెట్టుకోవాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

మీనం:
ఈ రాశి వారికి ఈ నెల మొత్తం ఇంట్లో సానుకూలమైన వాతావరణం ఉంటుంది. మీరు ఏ పని మొదలుపెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారుల ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest News