తెలంగాణలో మే నెలలోనే వర్షాలు కురిశాయి. దీంతో చాలా మంది వర్షాకాలం ముందే వచ్చిందని అనుకున్నారు. ఈసారి వర్షాలు భారీగా కురుస్తాయని చెప్పారు. కానీ జూన్, జూలై నెలలు గడిచినా.. కొన్ని ప్రాంతాల్లో సరైన వర్షపాతం నమోదు కాలేదు. కానీ హైదరాబాద్ లో మాత్రం కుండపోత వర్షం కురుస్తోంది. ఆదివారం వాతావరణ నివేదిక ప్రకారం.. హైదరాబాద్ లోని బోయినపల్లిలో 115.3 మిల్లీలీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయింది. ఆ తరువాత మారేడ్ పల్లిలో 114.8, బాలానగర్ 114.5 , బేగంపేటలో 112.8 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. జూన్ నెల వ్యాప్తంగా 24.2 మిల్లీ లీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా 4 జిల్లాల్లో మాత్రమే అత్యధిక వర్షపాతం నమోదు కాగా.. 11 జిల్లాలో లోటు వర్షపాతం ఏర్పడింది. మరి హైదరాబాద్ లోనే వర్షం అధికంగా పడడానికి కారణాలు ఏంటంటే?
అయ్యో.. వర్షంలో మొబైల్ తడిసిందా? ఇప్పుడేం చేయాలి? – insightearth.in – Telugu News Portal
- హైదరాబాద్ లోనే వర్షం ఎక్కువగా పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇది పెద్ద నగరం. అందువల్ల ఇక్కడ వేడి అధికంగా ఉంటుంది. దీనినే ‘Urban Heat Island Effect’ అని అంటారు. ఇక్కడున్న వాయువులు ఆర్ద్రతను ఆకర్షించి వర్షం పడేలా చేయగలవు.
- హైదరాబాద్ దక్కన్ పీఠభూమి. ఇక్కడ తూరు, పడమర రెండు వైపులా గాలులు వస్తాయి. ఇవి ఒకే చోట కలవడం వల్ల వాయు మేఘ సాంద్రత పెరుగుతుంది. దీంతో భారీ వర్షం కురుస్తుంది.
- హైదరాబాద్ నగరం సముద్ర మట్టానికి 500 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీంతో ఇక్కడ కొన్ని మేఘాలు కేంద్రీ కృతమై ఉంటాయి. దీంతో వర్షం త్వరగా పడడానికి ఆస్కారం ఉంటుంది.
- నైరుతి రుతు పవనాలు ప్రారంభం అయిన వెంటనే తెలంగాణలోని ప్రవేశించే ముందు హైదరాబాద్ లాంటి ఎత్తైన ప్రదేశాల్లో ముందుగా వర్షం కురుస్తుంది. ఆ తరువాత మిగతా ప్రాంతాల్లో వర్షం పడుతుంది.
- వేసవికాలం ముగిసే సమయంలో ఏర్పడే మేఘాలు ఈ ప్రాంతంలోనే ఎక్కువగా ఉండి ఘర్షణకు గురవుతాయి. అంతేకాకుండా ఇక్కడ సాయంత్రం సమయంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో రాత్రి సమయంలో ఎక్కువగా వర్షం కురుస్తుంది.
హైదరాబాద్ లో సాయంత్రం ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉన్నందున ముందే ఏర్పాట్లు చేసుకోవడం మంచిది. ఈ కాలంలో దూర ప్రయాణాలు చేయడం మంచిదికాదు. ఎందుకుంటే రాత్రి సమయంలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. అవసరం ఉంటే మాత్రమే సాయంత్రం బయటకు వెళ్లడం మంచిది. ముఖ్యంగా చిన్న పిల్లలను వర్షం కురిసే సమయంలో ఇంట్లోనుంచి బయటకు రాకుండా చూడాలి.





