ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. అయితే వర్షం కురుస్తున్న సమయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువుల విషయంలో కేర్ తీసుకోవాలి. ఉదయం నుంచి రాత్రి వరకు ప్రతి ఒక్క పనికి మొబైల్ తప్పనిసరి. ఈ మొబైల్ కనుక వర్షం కారణంగా ఆగిపోతే తీవ్ర ఆందోళన కలుగుతుంది. అందువల్ల వర్షంలో మొబైల్ పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఒక్కోసారి వర్షం లేదు కదా అని బయటకు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా వర్షం కురిస్తే.. మొబైల్ తడిచే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు?
మనం ఒక్కోసారి అనుకున్న పనులు సాధ్యం కావు. వర్షం వస్తుందని మొబైల్ ను కవర్లో ఉంచి తీసుకెళ్లినప్పుడు వర్షం రాదు.. కానీ వర్షం రాదు అనుకొని బయటకు వెళ్ళినప్పుడు కుంభవృష్టి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో మనం తడవడంతో పాటు మన వద్ద ఉన్న మొబైల్ కూడా తడిసిపోతుంది. అయితే మొబైల్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి అని అనుకున్న లోపే అది తడిచిపోతుంది. అయితే ఇలాంటి సమయంలో కొన్ని పనులు చేయడం వల్ల మొబైల్ సేఫ్ గా ఉండే అవకాశం ఉంది.
వర్షంలో తడిసి ఇంటికి వచ్చిన తర్వాత మొబైల్ తడిస్తే వెంటనే స్విచ్ ఆఫ్ చేయడం మంచిది. ఆ తర్వాత మొబైల్లో ఉన్న సిమ్ కార్డు.. మెమొరీ కార్డు ఉంటే దానిని తీసేయడం బెటర్. ప్రస్తుత స్మార్ట్ ఫోన్లో అవేమీ ఉండవు. కాబట్టి స్విచ్ ఆఫ్ చేయడమే మంచిది. ఆ తర్వాత మొబైల్ పై ఉండే నీరు పోవడానికి కాసేపు దీనిని బియ్యంలో ఉంచాలి. లేదా పొడి కాటన్ క్లాత్ ను చుట్టి ఉంచాలి. అలాకాకుండా మొబైల్ పై క్లాత్ తో గట్టిగా రుద్దకూడదు. అలా చేస్తే డిస్ప్లే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక కొందరు మొబైల్ పై నీరు ఉండగానే చార్జింగ్ పెట్టాలని ప్రయత్నిస్తారు. కానీ ఆ ప్రయత్నాలు అస్సలు చేయకూడదు. కనీసం 30 నిమిషాల పాటు మొబైల్ ను ఆరబెట్టాలి. ఆ తర్వాత స్విచ్ ఆన్ చేసుకోవడం మంచిది. ఈ సమయంలో మొబైల్ ఆన్ అయితే నో ప్రాబ్లం.. ఒకవేళ ఆన్ కాకపోతే మాత్రం అందులోకి వాటర్ వెళ్ళినట్టే..
అయితే ముందు జాగ్రత్తగా మొబైల్ వర్షంలో తడవకుండా ఏదైనా కవర్ను దగ్గరగా ఉంచుకోవాలి. లేదా ముందు జాగ్రత్తగా సిలికాన్ జెల్ ప్యాకెట్ను మొబైల్కు అమర్చుకోవడం మంచిది. ఇవి మొబైల్ కు చుట్టడం వల్ల వాటర్త్వ రగా పీల్చుకుంటాయి. ఇలా మొబైల్ ను వర్షాకాలంలో జాగ్రత్తగా ఉంచుకుంటే ఆర్థిక నష్టాలు ఉండకుండా ఉంటాయి.





