ప్రోటీన్ సమృద్ధిగా కావాలంటే మాంసాహారం తినాలని కొందరు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా నాన్ వెజ్ కాస్త రుచిగా ఉండడంతో చాలా మంది ఇది లేకుండా ఉండలేరు. కొంత మంది అయితే ప్రతిరోజూ మాంసం లేకుండా ముద్ద దిగదు అని చెబుతారు. అయితే భారతదేశంలో కొన్ని సర్వేల ప్రకారం నార్త్ కంటే ఎక్కువగా సౌత్ రాష్ట్రాల్లోనే మాంసాహారం తింటారని తేలించింది. మరి ఈ దక్షిణ రాష్ట్రాల్లో మాంసాహారం వినియోగించే విషయంలో ఏ రాష్ట్రాలు టాప్ ప్లేసులో ఉన్నాయో తెలుసా?
National Family Health Survey జనవరి 2025 ప్రకారం.. భారతదేశంలో 85 శాతం మంది ప్రజలు ఎక్కువగా నాన్ వెజ్ ను ఇష్టపడతున్నారు. ఇక మాంసాహారం ఎక్కువగా తినే రాష్ట్రాల్లో నాగాలాండ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రంలో 99.8 శాతం ప్రజలు నాన్ వెజ్ ను ఇష్టపడుతున్నారు. ఆ తరువాత పశ్చిమ బెంగాల్ రాష్ట్రం 99.3 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో కేరళ రాష్ట్రం నిలవగా ఇక్కడ 99.1 శాతం మంది నాన్ వెజ్ తింటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 98.25 శాతం ప్రజలు మాంసాహారం తింటూ నెంబర్ 4 స్థానంలో ఉన్నారు. తమిళనాడులో 97.65 శాతం మంది నాన్ వెజ్ ను ఇష్టపడుతూ ఐదోస్థానాన్ని ఆక్రమించారు. తెలంగాణ రాష్ట్రంల 97.4 శాతం మంది నాన్ వెజ్ తింటున్నట్ల సర్వేలో తేలింది.
దేశంలో ఉత్తరాదికంటే దక్షిణంలోనే ఎక్కువగా మాంసాహారం తింటున్నట్లు తెలుస్తోంది. నాగాలాండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లు చేపల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇందులో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సమద్ర తీరం ఉండడంతో ఇక్కడ ఎక్కువగా చేపలు తింటూ ఉంటారు. కేరళలోనూ చేపల వినియోగంతో పాటు మటన్ ఎక్కువగా వినియోగస్తారని తెలుస్తోంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చికెన్, మటన్ ఎక్కువగా వినియోగిస్తార. ఈ రాష్ట్రాల్లో కోళ్ల, గొర్ల పెంపకం ఎక్కవగా ఉంటుంది. వీటిని కేవలం ఆహారం కోసమే వినియోగిస్తారు.





