నిత్యాసరాల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మొన్నటివరకు ఉల్లి ధరలు.. ఆ తర్వాత టమాటా ధరలు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం వాటి ధరలు సాధారణ స్థితిలో ఉన్నాయి. కానీ బోడ కాకరకాయ ధర మాత్రం చుక్కలు చూపిస్తుంది. మార్కెట్లో ప్రస్తుతం రూ. 200 కి పైనే విక్రయిస్తున్నారు. అయితే మంగళవారం సిరిసిల్ల మార్కెట్లో రూ.400 పలికింది. సాధారణంగా జూలై, ఆగస్టు నెలలో ఎక్కువగా బోడ కాకరకాయలు మార్కెట్లోకి వస్తుంటాయి. కానీ ప్రస్తుతం వాటి ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతుండడంతో కొనుగోలు దారులు ఆందోళన చెందుతున్నారు.
మిగతా కూరగాయల కంటే బోడ కాకర ధర ఎక్కువగా ఉండడానికి కారణాలు ఉన్నాయి. ఇందులో పుష్కలమైన విటమిన్ లో ఉన్నాయి. బోడ కాకరలో బి12 విటమిన్ తో పాటు మెగ్నీషియం, కాల్షియం, జింక్ వంటి ఖనిజాలు లభిస్తాయి. శరీరం ఆరోగ్యంగా ఉండడానికి బోడ కాకర ఎక్కువగా తినాలని వైద్యులు సైతం చెబుతూ ఉంటారు. బుడ కాకర తినడం వల్ల చెవి నొప్పి, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు తొలగిపోతాయి. కడుపులో ఎలాంటి ఇన్ఫెక్షన్ గురికాకుండా ఉంటుంది.
ప్రస్తుతం మటన్ ధర కేజీ.800 పలుకుతోంది. కూరగాయల్లో బోడ కాకర రూ.400 పలుకుతూ మటన్ తో పోటీ పడుతుంది. ఇందులో పోషకాలు ఉండడంతోపాటు దీనికి కూడా ఎంతో రుచిగా కూడా ఉంటుంది. అందుకే చాలామంది ధర ఎంత ఎక్కువగా ఉన్నా బోడకా కారణం కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. అంతేకాకుండా ఇవి మార్కెట్లోకి చాలా తక్కువగా వస్తుంటాయి. అందుకే వీటికి డిమాండ్ ఉంటుంది. సాధారణంగా కొన్ని మార్కెట్లలో ఇవి లభించవు. అయితే ఇప్పుడు అన్ని మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. మార్కెట్లోకి ఎన్ని బోడ కాకర వచ్చిన కిలోకి రూ 100 కి మాత్రం తగ్గదు.





