అప్పు జీవితానికి మప్పు అని కొందరి అభిప్రాయం. కానీ కొన్ని అవసరాలను ముందే తీర్చకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో సరైన డబ్బు లేకపోతే అప్పు చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పు చేయడం తప్పు కాదు. కానీ ఆ అప్పును సరైన సమయంలో తీర్చడం ధర్మం. కానీ అనేక కారణాల వల్ల తీసుకున్న అప్పును తీర్చడానికి చాలా మంది ఆసక్తి చూపరు. అందుకు కారణం అసలు కంటే వడ్డీ ఎక్కువ కావడమే. ఈ వడ్డీ ఒకప్పుడు రూ.2 ఉండేది. కానీ ఇప్పుడు రూ.10తో కూడా అప్పు ఇస్తున్నారు. ఇలా తీసుకున్న దాని కంటే వడ్డీ ఎక్కువగా అవుతంది. ఇలాంటి సమయంలో కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నాయి. కానీ బ్యాంకులు లోన్లు ఇచ్చే సమయయంలో 10 శాతం వడ్డీ అని చెబుతూ ఉంటాయి. 10 శాతం వడ్డీ అంటే రూ.10నా? మరి ఎంత?
ఒక వ్యక్తి బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే.. ఆ మొత్తంపై విధించే వడ్డీని Rate Of Interst అని అంటారు. అంటే ఆ మొత్తంపై ఇచ్చే వడ్డీ శాతం అని చెబుతారు. బ్యాంకుల చెప్పే వడ్డీ శాతానికి.. ప్రైవేట్ వ్యక్తుల చెప్పే వడ్డీకి చాలా తేడా ఉంటుంది. అదెలా అంటే.. ఒక బ్యాంకు లక్ష రూపాయల లోన్ ఇస్తుందని అనుకుందాం. దీనిపై 10 శాతం వడ్డీ అని ప్రకటించిందని అనుకుందాం. ఇప్పుడు వడ్డీ ఎంత ఉంటుందంటే..?
సాధారణంగా వడ్డీ శాతాన్ని
12%గా నిర్ణయిస్తే.. 12% = 1 రూపాయి(100 పైసలు).
మరి 10%వడ్డీ అనుకుంటే..
10X100/12 = 83.33 పైసలు అంటే రూ.83 పైసలు అన్న మాట.
ఒక లక్ష రూపాయల రుణం తీసకుంటే దీనిపై 10 శాతం వడ్డీ అంటే రూ.100కి 83 పైసల పడుతందన్నమాట. అంటే రూ.1000కి రూ.8.30పైసలు. ఇలా.. రూ. లక్ష రూపాయలకు రూ.830 పడుతుందన్న మాట. అంటే బ్యాంకులు చెప్పే 10 శాతం వడ్డీ అంటే లక్ష రూపాయలకు రూ.830 అవుతుందని అనకోవాలి.
ఇలాగే 9 శాతం వడ్డీ అని చెబితే..
9X100/12 = 75 పైసలు. ఇలా వడ్డీ శాతాన్ని 100తో గుణించి.. ఆ మొత్తాన్ని 12 తో భాగించడం వల్ల అసలు వడ్డీ తెలుస్తోంది. మరోసారి బ్యాంకుకు వెళ్లినప్పుడు వడ్డీ శాతం ఎంత అని అడిగిన తరువాత ఇలా క్యాలెక్ చేసకోండి. అప్పుడు మీరు అనుకునే వడ్డీకి.. బ్యాంకు అధికారుల చెప్పే వడ్డీకి తేడా ఉందో తెలుసుకోండి..





