వ్యాపారం చేయాలని చాలా మందికి ఉత్సాహం ఉంటుంది. కానీ కొందరు మాత్రమే ఇందులో రాణిస్తారు. కొందరికి వ్యాపార మెళకువలు తెలిసి అందులో రాణిస్తారు.మరికొందరు ఎంత ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. అయితే వ్యాపారంలో ఉండే ప్రధాన లక్షణం కొనేవారిని ఆకట్టుకోవడం. ఏదో విధంగా వారిని వస్తువులు కొనేవిధంగా చేయడం. ఇలా వస్తువుల విక్రయాల్లో భాగంగా చాలా మంది అనేక రకాల ఫీట్లు వేస్తుంటారు. కొందరు నృత్యాలు చేస్తూ వ్యాపారం చేస్తే.. మరికొందరు తమ తీయనైన మాటలతో ఆకట్టుకుంటారు. అయితే మామిడి పండ్లు విక్రయించే ఓ మహిళ వినూత్న రీతిలో కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఆమె ఏం చేసిందో చూడండి..
సాధారణంగా మామిడి పండ్లు విక్రయించవారు వాటి ధర మాత్రమే చెబుతారు. కొంటే కొనని.. లేకపోతే లేదు.. అన్నట్లుగా ఉంటారు. కానీ ఓ యువతి మాత్రం తన మామిడి పండ్లను ఎలాగైనా కొనాలంటూ వార్నింగ్ ఇస్తోంది. ఛత్తీస్ గర్ కు చెందిన ఓ యువతి రాష్ట్రంలోని ఓ నగరంలో మామిడి పండ్లు విక్రయిస్తోంది. ఈ సందర్భంగా ఆమె కొనుగోలుదారులకు ఇలా చెబుతోంది. ‘మీ జీవితంలో సంపద, కీర్తి, డబ్బు ఉంటాయి. కానీ మామిడి పండ్లు ఉంటాయా? ఈరోజు కిలో నుంచి కిలోన్నర మామిడి పండ్లు తినండి. ప్రస్తుతం ధర తక్కువగా ఉంది. పండ్లు తినాలనుకుంటే తినండి.. లేకపోతే జై శ్రీరామ్’ అంటూ చెబుతోంది.
ఇలా చెబుతున్న ఆమె వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. కొందరు ఈ వీడియోపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు. మామిడి పండ్లు అమ్మే కొత్త పద్దతి అని కొందరు అంటుండగా.. మామిడి పండ్లు కొనకపోతే కొట్టేలా ఉంది.. అని కామెంట్ చేస్తున్నారు. ఏదీ ఏమైనీ ఈ యువతి వ్యాపారం చేసే విధానంపై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ ప్రతిభ మామిడి పండ్ల విషయంలో కాకుండా ఇతర వస్తువుల విషయంలో పెడితే ఇంకా బాగుంటుందని అని అంటున్నారు. మరి ఆమె మామిడి పండ్లు ఎలా అమ్మిందో మీరు కూడా చూసేయండి..





